Begin typing your search above and press return to search.

రొమాంటిక్ రూట్లో మెగా హీరో

By:  Tupaki Desk   |   23 May 2017 6:46 AM GMT
రొమాంటిక్ రూట్లో మెగా హీరో
X
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా ఇప్పటికే తనకంటూ ఐడెంటిటీ సంపాదించేసుకున్నాడు సాయిధరం తేజ్. సుప్రీం హీరో అని ఫ్యాన్స్ తో పిలిపించుకుంటూ దూసుకుపోతున్నాడు. వరుసగా మూడు సినిమాలతో అభిమానులను ఆకట్టుకున్న తేజు.. ఆ తర్వాత వరుసగా తిక్క.. విన్నర్ ల రూపంలో ఎదురుదెబ్బలు తినేశాడు. ఇప్పుడు బీవీఎస్ రవి దర్శకత్వంలో జవాన్ చిత్రంలో నటిస్తున్న సాయిధరం తేజ్.. కచ్చితంగా సక్సెస్ సాధిస్తానని ధీమాగా ఉన్నాడు.

దీని కంటే ముందే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన నక్షత్రం మూవీ రిలీజ్ కానుండగా.. ఇందుకో తేజు పోలీసాఫీసర్ గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు తేజు తర్వాతి సినిమా కూడా ఖాయమైందని తెలుస్తోంది. వివి వినాయక్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చినా.. కరుణాకరన్ తో సాయి ధరం ప్రాజెక్ట్ ఖాయమైందన్నది లేటెస్ట్ న్యూస్. రొమాంటిక్ మూవీస్ స్పెషలిస్ట్ గా గుర్తింపు ఉన్న కరుణాకరన్.. ఇప్పటికే మాస్ ఇమేజ్ సంపాదించుకున్న సాయిధరం తేజ్ కు.. మెమరబుల్ మూవీ ఇచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నాడు.

యాక్షన్ తో పాటు.. ఫన్ ఎలిమెంట్స్.. వీటన్నిటి చుట్టూ అల్లుకున్న ప్రేమ కథ.. ఇదీ మెగా హీరోకు కరుణాకరన్ చెప్పిన స్టోీ లైన్. మూవీ థీమ్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయగా.. జవాన్ ను పూర్తి చేయగానే కరుణాకరన్ సినిమా చేయనున్నాడు తేజు.