Begin typing your search above and press return to search.

మెగా ప్రస్థానానికి రంగం సిద్ధం..!

By:  Tupaki Desk   |   18 Jun 2019 5:04 PM GMT
మెగా ప్రస్థానానికి రంగం సిద్ధం..!
X
ఈ జెనరేషన్ లో హీరోలు సక్సెస్ బాట పట్టాలంటే దానికి సీక్రెట్ ఒకటే.. అదే 'కంటెంట్'. ఈ జెనరేషన్ కథలతో.. స్ట్రాంగ్ కంటెంట్ తో వచ్చిన దర్శకులతో సినిమాలు చేస్తే హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ హిట్ కాకపోయినా కనీసం మంచి పేరైతే వస్తుంది. ఇలా అయితే హీరోల నెక్స్ట్ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా కాకుండా రొ డ్డకొట్టుడు సినిమాలు చేస్తే ఉన్న మార్కెట్ కాస్తా పడిపోవడం ఖాయం. ఈ విషయాన్ని గుర్తించిన స్టార్ హీరోలు కూడా కొత్త కథలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరో సాయి తేజ్ కూడా అలాంటి బాటే పట్టాడు.

వరస ఫెయిల్యూర్ల తర్వాత సాయి తేజ్ రీసెంట్ గా 'చిత్రలహరి' సినిమాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చాలాకాలంగా ఎదురు చూస్తున్న హిట్ అయితే దక్కింది కానీ బ్లాక్ బస్టర్ అయితే కాలేదు. అందుకే తేజు తన నెక్స్ట్ సినిమాలు స్ట్రాంగ్ కంటెంట్ తో ఉండేవిగా ఎంచుకుంటున్నాడు. ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో తేజు 'ప్రతి రోజు పండగే' అనే సినిమాలో నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజు పక్కింటబ్బాయి టైపు క్యారక్టర్ లో నటిస్తునన్నాడట. ఇదిలా ఉంటే దేవా కట్టా దర్శకత్వంలో తేజు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

తేజు వరసగా మాస్ మాసాలా సినిమాలను.. కమర్షియల్ ఎంటర్టైనర్లను ఎంచుకునేవాడు. కానీ ఇపుడు ఈ లైనప్ చూస్తుంటే మాత్రం పూర్తిగా రూట్ మార్చినట్టుగా అనిపిస్తోంది. ఓ రెండేళ్ళ క్రితం అయితే తేజు ఇలా దేవా కట్టాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండేవాడు కాదేమో. 'ప్రస్థానం' లాంటి క్లాసిక్ ఫిలిం రూపొందించిన దేవా కట్టా మళ్ళీ ఆ మ్యాజిక్ ను రిపీట్ చెయ్యలేకపోయాడు. మరి తేజు లాంటి మాస్ హీరోతో ఎలాంటి సినిమా రూపొందిస్తాడో వేచి చూడాలి. .