Begin typing your search above and press return to search.

జవాన్ లో మొత్తంగా యాక్షనే...

By:  Tupaki Desk   |   23 Jun 2017 8:44 AM GMT
జవాన్ లో మొత్తంగా యాక్షనే...
X
సుప్రీం, తిక్క, విన్నర్ సాదా కథలతో వచ్చి ఫ్లాపులు కొట్టిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు యాక్షన్ హీరోగా మనముందుకు రాబోతున్నాడు. జవాన్ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్న సాయ్ ధరమ్ తేజ్ తన 100 % ఫోకస్ పెట్టాడంట. ఈ సినిమాలో చాల యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయిని వాటిని కొద్దిరోజులు కిందటనే విజయవంతగా షూటింగ్ పూర్తి చేశాము అని చెబుతున్నారు జవాన్ టీమ్. ఈ సినిమాను తెలుగు ఫేమస్ రైటర్ బి వి యెస్ రవి దర్శకత్వం చేస్తున్నాడు. దేశానికి ఒకడు ఉండాలి ఇంటికి ఒకడు కావాలి అనే కథతో అలరించడానికి వస్తున్నాడు.

ఈ సినిమా ఒక పోలీసు ఆఫీసర్ దేశాన్ని, కొన్ని కుటంబాలును ఎలా రక్షించాడు అనేది కథాంశం గా ఉంటుంది అని తెలుస్తుంది. పూర్తి యాక్షన్ డ్రామానే కాకుండా కొన్ని ఫ్యామిలి ప్రేక్షకులుకు నచ్చే ఎమోషన్స్ కూడా ఉన్నాయట. సాయ్ ధరమ్ తేజ్ ఈ సినిమాలో యాక్షన్ డ్రామా తో అందరిని ఆకట్టుకుంటాడు అని నమ్మకంగా చెబుతున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా గొప్పగా ఉండబోతుంది అని తెలిసింది. కథ ఎమోషన్ బలం ఎలా ఉన్న కమర్షియల్ సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారట.

ఇకపోతే సాయ్ ధరమ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. ఈ సినిమాకు సంగీతం అందించింది యెస్.యెస్.తమన్. ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా ఆశించిన ఫలితాలనే అందుకుంది. జవాన్ సినిమాను కృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగష్టు 11 నాడు విడుదల చేయడానికి సినిమాను సిద్దం చేస్తున్నారు.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/