Begin typing your search above and press return to search.

సింగిల్ టేక్ లో 1 మినిట్ మెగా డ్యాన్స్

By:  Tupaki Desk   |   28 July 2017 9:40 AM GMT
సింగిల్ టేక్ లో 1 మినిట్ మెగా డ్యాన్స్
X
తెలుగు హీరోలు అవడానికి ఉండవలిసిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే డ్యాన్స్ చేయడం. మామలుగా చేస్తే సరిపోదు ముందు ఉన్న హీరోలను మించి చేయగలగాలి. వట్టి డ్యాన్స్ చేస్తే మళ్ళీ సరిపోదు అది అందరికి అందంగా కనిపించాలి. ఇలా ఇన్ని లక్షణాలు డ్యాన్స్ లో పెట్టి చేయాలి అంటే అది ఎవరి వాళ్ళ అవుతుంది చెప్పండి. నిజానకి మెగాస్టార్ చిరంజీవి తరువాత ఆ రేంజిలో జూ.ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్‌ లే దూసుకుపోతున్నారు. అయితే ఇదే మెగా ఫ్యామిలీ నుండి మరో పేరు కూడా ఆ పొజిషన్ కోసం పోటీ పడుతోంది.

మెగా స్టార్ ఫ్యామిలి నుండి వస్తున్నాడు అంటే ఆ హీరో కచ్చితంగా డ్యాన్స్ పై పట్టు ఉంది తీరాలి. ఆ నమ్మకాన్ని ఏ మాత్రం తక్కువ చేయకుండా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన డ్యాన్స్ తో మెగా అభిమానులను అభిమానాన్ని పొందాడు. ఇప్పుడు తన సినిమాలు హిట్ ట్రాక్ లో లేకపోయినా రాబోతున్న 'జవాన్' 'నక్షత్రం' సినిమాలతో మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాడు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమా జవాన్ లో ఒక పాట కోసం అద్భుతమైన డాన్స్ చేశాడు అని తెలుస్తోంది. అది కూడా ఆ పాటలో నాన్ స్టాప్ గా ఒక నిముషం పాటు డ్యాన్స్ చేశాడట. అదీ కూడా సింగల్ టేక్ లో పర్ఫెక్ట్ గా చేసి సెట్లో ఉన్న అందరిని వావ్ సూపర్బ్ అనేలా చేశాడని చెబుతున్నారు.

రైటర్ డైరెక్టర్ బి వి యెస్ రవి జవాన్ సినిమాకు డైరక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంగీతం యెస్ యెస్ తమన్ అందిస్తున్నాడు. ఒక భారీ సెట్ లో ఈ పాట షూటింగ్ జరుగుతుంది. ఈ పాటలో తమన్ ఇచ్చిన బీట్ కు సాయి ధరమ్ తేజ్ అదిరిపోయే స్టెప్లు వేయడమే కాదు.. ఇప్పుడు ఈ పాటో ఇంకోటేదో మ్యాజిక్ కూడా ఉందట. చూద్దాం అదేంటో మరి!!