Begin typing your search above and press return to search.

ఏంటండీ బాబూ.. ఇంత స్పీడా?

By:  Tupaki Desk   |   23 May 2018 2:48 PM GMT
ఏంటండీ బాబూ.. ఇంత స్పీడా?
X
కొంతమంది హీరోలు బ్రేక్ తీసుకుంటే చాలు.. పట్టాలెక్కడానిక ఏళ్ళ సమయం పడుతుంది. కొంతమంది మాత్రం అస్సలు బ్రేక్ అవసరం లేదు. ఆ మధ్యన రామ్ చరణ్‌ ఏడాది గ్యాప్ తీసుకుంటే.. రవితేజ రెండేళ్ళ గ్యాప్ తీసుకున్నాడు. వీళ్లకంటే ముందు మహేష్‌ బాబు అయితే ఏకంగా మూడేళ్ళు రిలీజ్ లేకుండా గడిపేశాడు. కాని హార్డ్ వర్కింగ్ టూ ద కోర్ అంటే.. నాని.. శర్వానంద్ వంటి స్టార్లు గుర్తొస్తారు. బ్రేక్ లేకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉంటారు. ప్రతీ పండక్కీ నాలుగు రోజులు ముందో వెనుకో వీళ్ల సినిమా కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ గ్యాంగులో సాయిధరమ్ తేజ్ కూడా జాయిన్ అవుతున్నాడు.

మొన్న ఫిబ్రవరి నెలలో ''ఇంట్టెలిజెంట్'' అంటూ ప్రేక్షకులను పలకరించి.. బాగా నిరాశరపరిచాడు మెగా మేనల్లుడు. సాక్షాత్తూ వివి వినాయక్ అక్కడున్నా.. అందాల రాక్షసి తన గ్లామర్ దారబోసినా..ఎందుకో పనవ్వలేదు. అయితే ఆ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలోనే మనోడు కరుణాకరన్ చెప్పిన కథను కూడా ఓకే చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆ సినిమాతో రిలీజ్ కు రెడీ అయిపోయాడు కూడాను. ''తేజ్.. ఐ లవ్ యు'' అంటూ సాయిధరమ్ అండ్ అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తయ్యింది. అంతేకాదు.. జూన్ 29న మూవీ రిలీజ్ కానుంది కూడాను.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ అయిపోయిందో లేదో.. ఓసారి కిషోర్ తిరుమల వంటి దర్శకులు నెరేట్ కతలను వినబోతున్నాడట మెగా మేనల్లుడు. వాటిలో ఏదో ఒకటి పూర్తి చేసి.. తేజ్ ఐ లవ్ యు రిలీజయ్యేనాటికి వాటిని పట్టాలెక్కిస్తాడట. అంటే ఈ ఏడాది చివర్లో మరో సినిమాతో మళ్ళీ పలకరిస్తాడనమాట. వాటే స్పీడ్ తేజ్ జీ!!