Begin typing your search above and press return to search.

బావ.. బావమరిది.. ఒక ‘తొలి ప్రేమ’

By:  Tupaki Desk   |   17 Dec 2017 9:11 AM GMT
బావ.. బావమరిది.. ఒక ‘తొలి ప్రేమ’
X
మెగా ఫ్యామిలీ యువ కథానాయకులిద్దరి కళ్లు ఇప్పుడు ఒక్కసారిగా ‘తొలి ప్రేమ’పై పడ్డాయి. డెబ్యూ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేస్తున్న లవ్ స్టోరీకి ‘తొలి ప్రేమ’ అనే టైటిల్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆల్రెడీ పూర్తి కావచ్చింది. టైటిల్ ఖరారు చేసి ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేసేశారు. వరుణ్ నుంచి వస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ ఇదని అంటున్నారు. ఐతే వరుణ్ బాబాయి నటించిన ‘తొలి ప్రేమ’కు ఈ ‘తొలి ప్రేమ’కు కనెక్షన్ ఎంత అన్నది తెలియడం లేదు. కేవలం క్రేజ్ కోసం ‘తొలి ప్రేమ’ను వాడుకున్నారా.. లేదా ఆ సినిమాతో ఏమైనా కనెక్షన్ ఉందా అన్నది ఫిబ్రవరి 9న తేలబోతోంది.

ఇదిలా ఉంటే.. మరో మెగా ఫ్యామిలీ కుర్రాడు సాయిధరమ్ తేజ్ ‘తొలి ప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో ఓ ప్రేమకథ చేయడానికి రెడీ అయ్యాడు. తాను తీసిన క్లాసిక్ మూవీ స్టయిల్లోనే దీన్ని కూడా తీర్చిదిద్దబోతున్నాడట కరుణాకరన్. ఈ చిత్రం ‘తొలి ప్రేమ’ లైన్స్ లోనే సాగుతుందని.. ఆ చిత్రంతో దీనికి చాలా పోలికలు ఉన్నాయని అతనంటున్నాడు. బహుశా వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’ టైటిల్ వాడకపోయి ఉంటే.. తేజు-కరుణాకరన్ సినిమాకే ఆ టైటిల్ ఫిక్సయి ఉండేదేమో. వరుణ్ ‘తొలి ప్రేమ’ ఇంకో 50 రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తేజు ‘తొలి ప్రేమ’ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశముంది. మరి బావ బావమరదుల మధ్య ‘తొలి ప్రేమ’ పోరు ఎలా ఉంటుందో చూడాలి.