Begin typing your search above and press return to search.

మెగా హీరో భలే డేర్ చేశాడే

By:  Tupaki Desk   |   20 Nov 2017 12:02 PM GMT
మెగా హీరో భలే డేర్ చేశాడే
X
యంగ్ జనరేషన్ హీరోలు గతంలో మాదిరిగా అండర్ ప్రొఫైల్ చేయాలని భావించడం లేదు. తమ తమ అభిప్రాయాలను ఓపెన్ గానే వెల్లడిస్తూ ఆకట్టుకుంటున్నారు. కానీ.. ఓ హీరో న్యూడిటీ.. సెమీ న్యూడిటీ మీద రియాక్ట్ అవడం అంటే మాత్రం సెన్సేషన్ అనాల్సిందే.

ఫోటోషూట్స్ కి పోజులు ఇవ్వడంలో ఒక్కొక్కళ్లది ఒకో తీరు. అందాలను ప్రదర్శించడం లో.. నగ్నత్వం చూపించడం.. అర్ధనగ్నత్వాన్ని అందంగా ప్రదర్శించడం కూడా ఉంటాయి. మన దేశంలో కూడా హీరోయిన్స్.. మోడల్స్ ఈ ట్రెండ్ ను అలవరచుకుంటున్నారు. విదేశీ భామలు ఇక్కడికి ఇంపోర్ట్ అవడం పెరిగిన తర్వాత ఈ ట్రెండ్ ఇంకా ఊపందుకుంది. బ్రెజిలియన్ భామ లారిస్సా బొనెస్సీ ఇలాంటి వాటిలో బాగా ఆరితేరిపోయింది. రీసెంట్ గా ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసింది లారిస్సా. ఇందులో తన పరువాలను దాచుకునేందుకు ఓ చేతిని అడ్డం పెట్టుకుని కనిపిస్తుందంతే.

ఈమె ఇలాంటి పోజ్ ఇవ్వడంలో వింతేమీ లేదు కానీ.. ఈ ఫోటోకు మెగా హీరో సాయిధరంతేజ్ లైక్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. గతంలో వీరిద్దరూ కలిసి తిక్క మూవీలో యాక్ట్ చేశారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. దాన్ని పురస్కరించుకునే.. ఇలా లారిస్సా షేర్ చేసిన పిక్ ను తేజు వెంటనే లైక్ చేశాడని చెప్పచ్చు.