యోగి 2.ఓ రీ లోడెడ్ వర్షన్ రాబోతుంది

Mon Dec 10 2018 12:48:22 GMT+0530 (IST)

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కబాలి’ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ చిత్రంలో నటించిన సాయి ధన్సికకు మంచి గుర్తింపు దక్కింది. ఆ చిత్రం తర్వాత ధన్సిక కెరీర్ పూర్తిగా టర్న్ అయ్యింది. మంచి ఆఫర్లు వస్తుండటంతో పాటు ధన్సిక క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. కబాలి చిత్రంలో రజినీకాంత్ కూతురు యోగి పాత్రలో ధన్సిక కనిపించిన విషయం తెల్సిందే. గ్యాంగ్ స్టర్ సభ్యురాలిగా - మంచి బాడీలాంగ్వేజ్ తో ధన్సిక యోగి పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇప్పుడు ఆ పాత్రకు అనధికారిక కొనసాగింపుగా సినిమా రాబోతుంది.‘కబాలి’ సినిమాలో రజినీకాంత్ చెప్పే కబాలిదా.. ఎంతో ఫేమస్ అయ్యింది కదా - ఇప్పుడు యోగి పాత్రకు కొనసాగింపుగా రాబోతున్న సినిమాకు ‘యోగిదా..’ అంటూ టైటిల్ ను ఖరారు చేశారు. యోగి పాత్రను మరింత పవర్ ఫుల్ గా ఈ చిత్రంలో చూపించబోతున్నారు. సాయి ధన్సిక మరోసారి ఈ చిత్రంతో ఆకట్టుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యిందని సాయి ధన్సిక సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది.

గౌతమ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందబోతున్న ‘యోగిదా’ చిత్రంకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ సోదరి ఇశ్రత్ ఖాద్రీ సంగీతాన్ని అందించబోతుంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. పోస్టర్ లో యోగి పాత్రకు తాజాగా ఈ పాత్ర అప్ డేటెట్ అయినట్లుగా రీ లోడెడ్ అయినట్లుగా అనిపిస్తుందని అప్పుడే ప్రేక్షకులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు.