Begin typing your search above and press return to search.

లీక్ ఎఫెక్ట్.. సాహో టీజర్ సాయంత్రమే

By:  Tupaki Desk   |   27 April 2017 7:23 AM GMT
లీక్ ఎఫెక్ట్.. సాహో టీజర్ సాయంత్రమే
X
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న కొత్త సినిమా ‘సాహో’ టీజర్ ను ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాతో కలిపి ప్రదర్శించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల కిందట ఈ విషయాన్ని ధ్రువీకరించిన ‘యువి క్రియేషన్స్’ అప్పట్నుంచి సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ కూడా నడుపుతోంది. కానీ ఈలోపే ఈ టీజర్ లీకైపోయింది. సోషల్ మీడియాలో.. వాట్సాప్ గ్రూపుల్లో హల్ చల్ చేయడం మొదలుపెట్టింది. సాధ్యమైనంత వరకు నెట్లో ఈ టీజర్ లీక్డ్ వీడియోను డిలీట్ చేయించే ప్రయత్నం చేసిన యువి క్రియేషన్స్.. ఇక లాభం లేదని అఫీషియల్ టీజర్ ను కొంచెం ముందుగానే రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ‘బాహుబలి-2’ విడుదలకు ఒక రోజు ముందే ఈ టీజర్ లాంచ్ కాబోతోంది.

గురువారం సాయంత్రం 5 గంటలకే అఫీషియల్ గా యూట్యూబ్ ద్వారా ‘సాహో’ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ముందు యూట్యూబ్ లో సందడి చేశాక.. ఆ తర్వాత ‘బాహుబలి’ థియేటర్లను హోరెత్తించనుంది ‘సాహో’ టీజర్. నిజానికి ‘బాహుబలి-2’ షోలు ఈ రోజు రాత్రి 9 గంటలకే మొదలవనున్న నేపథ్యంలో ‘సాహో టీజర్’ ఈ రోజే వచ్చేస్తున్నట్లే లెక్క. ఐతే దానికంటే నాలుగు గంటల ముందే యూట్యూబ్ లో టీజర్ చూసుకునే అవకాశం కల్పించబోతున్నారు. ఒకేసారి తెలుగు.. తమిళం.. హిందీ టీజర్లను రిలీజ్ చేయబోతున్నారు. ‘బాహుబలి’తో ప్రభాస్ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నేపథ్యంలో ఈ టీజర్.. నాన్-బాహుబలి ఇండియన్ టీజర్ రికార్డుల్ని బద్దలు కొట్టేస్తుందని అంచనా వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/