Begin typing your search above and press return to search.

సాహో.. రాకింగ్ రిలీజ్ అప్డేట్

By:  Tupaki Desk   |   17 Dec 2018 8:48 AM GMT
సాహో.. రాకింగ్ రిలీజ్ అప్డేట్
X
2019 లో రిలీజ్ కానున్న చిత్రాలలో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటి అని అడిగితే అనుమానం లేకుండా ప్రభాస్ నెక్స్ట్ ఫిలిం 'సాహో' పేరును ఎక్కువ మంది చెప్తారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నవిషయం తెలిసిందే. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడం.. 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1' తో సినిమా శాంపిల్ చూపించడంతో ఈ సినిమాపై ఆసక్తి విపరీతంగా పెరిగింది.

ఫ్యాన్స్ ఎంతోకాలంగా వేచి చూస్తున్న ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిలిం మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా వచ్చే ఏడాది ఆగష్టు 15 న 'సాహో' ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ను తెలుగుతో పాటుగా హిందీ.. తమిళ భాషలలో ఒకేసారి త్రిభాషా చిత్రంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రపంచావ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఫిలింమేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.

'బాహుబలి' విజయం తో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన నేపథ్యంలో ఈ సినిమాను ప్యాన్-ఇండియా అప్పీల్ ఉండేలావివిధ భాషలకు చెందిన నటులను తీసుకున్నారు. బాలీవుడ్ యాక్టర్స్ చాలామంది ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్ శ్రద్ధ కపూర్.. జాకీ ష్రాఫ్.. నీల్ నితిన్ ముఖేష్.. మందిరా బేడి.. చుంకీ పాండేల తో పాటుగా మహేష్ మంజ్రేకర్ కూడా ఇందులో నటిస్తున్నారు. ఇక తమిళ నటుడు అరుణ్ విజయ్ కూడా ఇందులో ఒక పాత్రలో నటిస్తున్నాడు. పలువురు హాలీవుడ్ టెక్నిషియన్లు ఈ సినిమాకు పనిచేశారు. కేన్నీ బేట్స్ అద్వర్యంలో యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించారు శంకర్ - ఎహసాన్ - లాయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్ వారు ఈ క్రేజీ మూవీకి నిర్మాతలు.