Begin typing your search above and press return to search.

దుబాయి జంక్షన్లో సాహో యాక్షన్

By:  Tupaki Desk   |   23 Jun 2017 8:41 AM GMT
దుబాయి జంక్షన్లో సాహో యాక్షన్
X
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ కెరియర్లో పెద్ద మార్పులు వచ్చాయి. ఇప్పటి నుండి చేసే ప్రతి సినిమాను మొత్తం దేశమంతా ఉన్న అభిమానులును దృషిలో పెట్టుకొని రూపొందించాలి. అందుకే బాహుబలి ఘన విజయం తరువాత వస్తున్న సినిమా ‘సాహో’ కూడా మేకింగ్లో ఏమాత్రం రాజీలేకుండా నిర్మిస్తున్నారు. ప్రభాస్ కు ప్రతినాయకుడు గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ నటిస్తున్నాడు ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో. నీల్ నితిన్ ముకేష్ పై ఇప్పటికే కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేయడం జరిగింది. కొద్ది రోజులు కిందటనే హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు.

ఇప్పుడు మరో భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం సాహో టీమ్ దుబాయి బయలుదేరింది. జూలై మొదటి వారంలో షూటింగ్ మొదలువుతుంది అని తెలిసింది. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ‘కెన్ని బేట్స్’ లొకేషన్లు పరిశీలిస్తునట్లు టాక్. దుబాయి, అభూ ధాబి ఇంకా మరికొన్ని యూరోపియన్ దేశాలలో కూడా షూటింగ్ లొకేషన్లు కోసం గాలిస్తున్నారు యాక్షన్ డిపార్ట్మెంట్ టీమ్. అక్కడ ఫేమస్ బుర్జ్ ఖలీఫా లో కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. మిషన్ ఇంపాజిబుల్ - స్కై స్క్రాపర్ - ఘోస్ట్ ప్రోటోకాల్ లాంటి హాలీవుడ్ సినిమాలలో యాక్షన్ ఎపిసోడ్స్ బుర్జ్ ఖలీఫా లోనే షూట్ చేశారు. ఇప్పుడు సాహో లో కూడా హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూస్ లా యాక్షన్ చేయబోతున్నాడు ప్రభాస్.

యూ‌వి క్రియేషన్స్ ప్రొడక్షన్లో నిర్మిస్తున్న సాహో సినిమాను ఎక్స్ ప్రెస్ రాజ మూవీ ఫేమ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను సుమారుగా 200 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు - తమిళ్ - హింది - మలయాళం లో విడుదల చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన నటించే నటి ఇంకా ఖరారు కాలేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/