Begin typing your search above and press return to search.

‘చక్‌దే ఇండియా’ నటితో జహీర్ ఖాన్ పెళ్లి

By:  Tupaki Desk   |   23 Nov 2017 7:53 AM GMT
‘చక్‌దే ఇండియా’ నటితో జహీర్ ఖాన్ పెళ్లి
X
టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఒక ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు - సినీ నటి సాగరిక ఘట్కేను ఈ ఉదయం అధికారికంగా వివాహమాడాడు. కొన్నాళ్లుగా సహవాసం చేస్తున్న ఈ జంట ఈ రోజు ఉదయం తమ పెళ్లిని అధికారికంగా రిజిష్టర్ చేయించింది. జ‌హీర్ స్నేహితురాలు - ప్రోస్పోర్ట్ ఫిట్‌ నెస్ స్టూడియో మార్కెటింగ్ హెడ్ అంజ‌నా శ‌ర్మ ఇన్‌ స్టాగ్రాంలో ఈ ఫొటోలను షేర్ చేయడంతో జహీర్ పెళ్లి విషయం అందరికీ తెలిసింది. ప్రస్తుతం జహీర్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

కాగా మరో నాల్రోజుల్లో జహీర్ తన వివాహం సందర్భంగా విందు ఇవ్వనున్నారు. న‌వంబ‌ర్ 27న ముంబైలోని తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్ అండ్ ట‌వ‌ర్‌ లో వీరి వివాహ రిసెప్ష‌న్ జ‌ర‌గనుంది. వివాహ రిసెప్ష‌న్‌ కి సంబంధించిన ఆహ్వాన‌ప‌త్రిక‌ను సాగ‌రిక స్నేహితురాలు - చ‌క్ దే ఇండియాలో ఆమె స‌హ‌న‌టి విద్యా మాల్వంక‌ర్ షేర్ చేసింది.

మరోవైపు నాల్రోజుల్లో వివాహ రిసెప్షన్ ఉన్నప్పటికీ ఈ రోజు సాయంత్రం కూడా జహీర్ ఖాన్ అత్యంత సన్నిహితుల కోసం గురువారం సాయంత్రం కాక్‌ టైల్ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆదివారం మెహందీ ఫంక్షన్ ఉన్నట్లు జహీర్ సన్నిహితులు చెప్తున్నారు. సాగరిక చక్ దే ఇండియా సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.