చక్ దే బ్యూటి ఫుట్ బాల్ ఆడితే..

Wed May 16 2018 16:18:04 GMT+0530 (IST)

సాగరికా ఘట్గే.. ఈమె మనకు ఇండియన్ క్రికెటర్ జహీర్ ఖాన్ భార్య గా కంటే ముందు ఒక హీరోయిన్ గా తెలుసు. షారుఖ్ ఖాన్ చక్ దే సినిమాతో అరంగేట్రం చేసిన సాగరికా ఎక్కువ సినిమాలు చేయకపోయినా సంవత్సరానికి ఒక సినిమాలో మాత్రం మెరిసింది. ఇపుడు మళ్ళీ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఒక వీడియో వలన వార్తల్లో నిలిచింది.క్రికెటర్ భార్య కదా బాట్ బాల్ తో పోజ్ ఇచ్చి ఉంటుంది అనుకుంటున్నారేమో. బాల్ మాట వాస్తవమే కానీ అది క్రికెట్ బాల్ కాదండోయ్ ఫుట్ బాల్. ఆకుపచ్చ రంగు చీరలో ఒక అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్న ఈ మహారాష్ట్ర అమ్మాయి ఆ వీడియో లో ఫుట్ బాల్ ని తంతూ కనిపించింది. మొదట బాల్ పైన కాలు పెట్టి ఫోటోలకు పోజ్ ఇచ్చిన ఈమె తర్వాత గట్టిగా తన్నింది. చుట్టూ ఉన్న ప్లేయర్లు చీర్ చేస్తూ అరవగా ఆమె సిగ్గుపడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది.

ఇంతకీ సడన్ గా ఈ క్రికెటర్ భార్య ఫుట్ బాల్ తో పోజ్ ఎందుకు ఇచ్చిందో అనుకుంటున్నారా? ఈమె త్వరలో మాన్సూన్ ఫుట్బాల్ అనే ఒక మరాఠీ సినిమాలో కనిపించబోతోంది. దాని కోసమే ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది. ట్రైనింగ్ పూర్తి అవ్వగానే ఈ సినిమా షూటింగ్ జులై లో మొదలు కాబోతోంది.