Begin typing your search above and press return to search.

కామిక్ హీరోగా క్రికెట్ దేవుడు!

By:  Tupaki Desk   |   18 Oct 2017 7:59 AM GMT
కామిక్ హీరోగా క్రికెట్ దేవుడు!
X
భార‌త్ లో క్రికెట్ ఉన్న ఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పన‌వ‌స‌రం లేదు. అభిమానులు లెజెండ‌రీ క్రికెట‌ర్ - మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ ను క్రికెట్ దేవుడిగా భావిస్తారు. భార‌త క్రికెట్ కు స‌చిన్ చేసిన విశేష సేవ‌ల‌కు గుర్తింపుగా ఆయ‌నకు భార‌త ర‌త్న ల‌భించింది. ప్ర‌స్తుతం స‌చిన్ రాజ్య‌స‌భ ఎంపీగా కూడా ప‌నిచేస్తున్నారు. స‌చిన్ జీవిత విశేషాల‌ను తెలియ‌జేస్తూ స‌చిన్ ఆటోబ‌యోగ్ర‌ఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే ' ను బోరియా మ‌జుందార్ 2014లో రాశారు. ఆ పుస్త‌కాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాడ‌ర్ అండ్ స్టాట‌న్ ప‌బ్లిష‌ర్స్ వారు ముద్రించారు. అప్ప‌ట్లో ఆ ఆటోబ‌యోగ్ర‌ఫీ పుస్త‌కానికి విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భించింది.

పిల్ల‌లలో స‌చిన్ ప‌ట్ల ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దానిని క్యాష్ చేసుకోవ‌డానికి స‌చిన్ ఆటోబ‌యోగ్ర‌ఫీని కామిక్ బుక్ రూపంలో ముద్రించాల‌ని హాడ‌ర్ అండ్ స్టాట‌న్ ప‌బ్లిష‌ర్స్ భావిస్తోంది. స‌చిన్ ఆటోబ‌యోగ్ర‌ఫీ 486 పేజీలు ఉంటుంది. దానిని స‌గానికి కుదించి కామిక్ బుక్ ను ఒక‌టి లేదా రెండు వారాల్లో విడుద‌ల చేయాల‌ని ప‌బ్లిష‌ర్స్ నిర్వాహ‌కులు భావిస్తున్నారు. ఈ కామిక్ బుక్ లో ప్ర‌త్యేకంగా స‌చిన్ ను కామిక్ హీరోగా చూపిస్తూ 25 పేజీల‌ను ముద్రించ‌నున్నారు. 1998 షార్జా క‌ప్‌ - మొద‌టి సెంచ‌రీ - 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ వంటి విశేషాల‌ను ప్ర‌త్యేకంగా ఆ 25 పేజీల‌లో పొందుప‌రుస్తారు. గ‌తంలో విడుద‌ల చేసిన ఆటోబ‌యోగ్ర‌ఫీకి ల‌భించిన‌ట్లే ఈ కామిక్ బుక్ కు కూడా ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని ప‌బ్లిష‌ర్స్ భావిస్తున్నారు.