Begin typing your search above and press return to search.

హాలీవుడ్ కంటే సక్సెస్ రేట్ తక్కువ

By:  Tupaki Desk   |   12 Sep 2017 7:54 AM GMT
హాలీవుడ్ కంటే సక్సెస్ రేట్ తక్కువ
X
సినిమా మీద మక్కువతో కొంత మంది వ్యాపారవేత్తలు సినిమాల్లో నటించి వారి కోరికను తీర్చుకుంటారు. అదే తరహాలో సినిమాలో తనదైన పాత్రలతో విజయాలకు పరితపిస్తున్న హీరో సచిన్ జోషి. ఓ వైపు తన బిజినెస్ లో బిజీగా ఉంటూనే అప్పుడపుడు సినిమాల్లో హీరోగా నటిస్తూ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. అసలైతే ఈ హీరో ఉండేది నార్త్ సైడ్ అయినా అక్కడ సినిమాలకంటే ఎక్కువగా సౌత్ లోనే సినిమాలను తీస్తుంటాడు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమతో సచిన్ చాలా క్లోజ్ గా ఉంటాడు.

ప్రస్తుతం ఈ హీరో తమిల్ - తెలుగులో ఓ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. SMS - భీమిలి కబడ్డీ జట్టు వంటి మంచి సినిమాలను తెరకెక్కించిన తాతినేని సత్య దర్శకత్వంలో "వీడెవడు" అని సినిమాను తీశాడు. ఈ సినిమాను రెండు భాషల్లో ఒకేసారి ఈ నెల 15న రిలీజ్ చేయబోతున్నాడు. ఈ సందర్బంగా చిత్ర విలేకరులతో మాట్లాడిన సచిన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. అయన మాట్లాడుతూ.. ఒక కబడ్డీ ప్లేయర్ చుట్టూ తిరిగే కథ ఇది. ప్రతి సన్నివేశం చాలా థ్రిల్ గా ఉంటుంది.ఎందుకంటే అతని మంచివాడా ? కాదా ? అనే అనుమానం చిత్రం చివరివరకు అంతుచిక్కదు. ఇక సినిమాలో ఫైట్స్ కూడా కబడ్డీ నేపథ్యంలో నే ఉంటాయని తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చాడు, ఇక చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ ఇక్కడ చిత్రాల సక్సెస్ రేట్ చాలా తక్కువ.

హాలీవుడ్ల్లో నూటికి 40% సినిమాలు సక్సెస్ అవుతుంటే.. మన పరిశ్రమల్లో మాత్రం కనీసం 2% కూడా లేదని వ్యాఖ్యానించాడు. దానికి కారణం మన దగ్గర అద్భుతమైన దర్శకుల కొరత చాలా ఉందని కేవలం రాజమౌళి లాంటి దర్శకులు మాత్రమే సక్సెస్ ను అందుకొనగలుగుతున్నారని తెలిపాడు. ఇక ప్రేక్షకుల ఆలోచన ధోరణి కూడా చాలా మారిందని కొత్తగా ఉంటేనే సినిమాలను ఆదరిస్తున్నారని తమ సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు