Begin typing your search above and press return to search.

ప్చ్!! ఆన్ లైన్ లో పైరసీ సచిన్

By:  Tupaki Desk   |   28 May 2017 4:56 AM GMT
ప్చ్!! ఆన్ లైన్ లో పైరసీ సచిన్
X
పైరసీ ఇప్పుడు రాజ్యమేలుతోందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. సినిమా రిలీజ్ తర్వాత కాదు.. విడుదలకు కొన్ని వారాల ముందే ఆన్ లైన్ లో కొన్ని మూవీస్ దర్శనమిచ్చేస్తున్నాయి. దీని దెబ్బను పెద్ద సినిమాలు అంతో ఇంతో తట్టుకుంటున్నా.. చిన్న సినిమాలు చితికిపోతున్న మాట మాత్రం వాస్తవమే.

ఆల్ టైం లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితంపై రూపొందిన బయోపిక్.. రీసెంట్ గా రిలీజ్ అయింది. మే 26న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రంపై మంచి స్పందనే వస్తోంది. వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో ఈ చిత్రానికి కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. తొలి రోజున 8.4 కోట్ల రూపాయలు వసూలు చేసిన సచిన్: ది బిలియన్ డ్రీమ్స్ మూవీకి ఇప్పుడు పైరసీ చిక్కులు ఎదురయినట్లు తెలుస్తోంది. మూవీ రిలీజ్ అయిన 24 గంటల్లోనే సచిన్ బయోపిక్ కు సంబంధించిన ప్రింట్ ఆన్ లోకి వచ్చేసినట్లు చెబుతున్నారు.

హై క్వాలిటీ ప్రింట్ తో సచిన్ మూవీ నెల్ లో హల్ చల్ చేస్తుండడాన్ని మూవీ యూనిట్ తెలుసుకుంది. అలాగే కొన్ని సైట్లలో ఈ చిత్రాన్ని ఆన్ లైన్ స్ట్రీమింగ్ ద్వారా టెలికాస్ట్ చేసేస్తున్నారు. ఇది సచిన్ బయోపిక్ వసూళ్లపై పెను ప్రభావమే చూపనుందని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/