Begin typing your search above and press return to search.

మణి-కార్తి-రెహమాన్ కొత్త పాట వావ్..

By:  Tupaki Desk   |   1 March 2017 12:47 PM GMT




ఆల్రెడీ ‘చెలియా’ సినిమాలో రెండు పాటలు వీనుల విందు.. కనువిందు చేశాయి. ఇప్పుడు మూడో పాట కూడా వచ్చేసింది. మోరెత్తుకొచ్చింది.. అంటూ సాగే కొత్త పాటను రెహమాన్ ట్విట్టర్లో లాంచ్ చేశాడు. పెళ్లి వేడుక నేపథ్యంలో వచ్చే ఈ పాట ఇకపై ఆ వేడుకల్లో మార్మోగితే ఆశ్చర్యమేమీ లేదు. అంత చక్కగా ఉంది ఈ పాట. రెహమాన్ బాణీ స్పష్టంగా వినిపిస్తున్న ఈ పాట చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. ఈ పాటలో అన్నింటికన్నా ఎక్కువ ఆకట్టుకునేది ఇందులోని లిరిక్సే. డైరెక్ట్ తెలుగు పాటల్లో సైతం వినిపించని చక్కటి తెలుగు పదాలతో ఈ పాటను చాలా అందంగా రాశారు.

‘‘మోరెత్తుకొచ్చింది బూరెత్తి ఊదింది ఊరంత మోగింది దివ్విట్టం.. గోరెట్టి గిచ్చింది గోలంత పెంచింది లోలోన మా మంచి ముహూర్తం’’ ఇలా చక్కటి తెలుగు పదాలతో ఆహ్లాదకరమైన పాట రాశారు. మణిరత్నం తన సినిమాల తెలుగు వెర్షన్ల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటాడో ఈ పాట వింటే అర్థమవుతుంది. ఈ పాటలో విజువల్స్ కూడా చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. హీరోయిన్ అదితిరావు హైదరి పాటకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. మార్చి నెలాఖరులోనే ‘చెలియా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో ఉన్న మిగతా పాటల్ని కూడా ఇలా ఒక్కొక్కటిగా రిలీజ్ చేయబోతున్నాడు రెహమాన్. ఆ తర్వాత రెండు భాషల్లోనూ వేర్వేరుగా ఆడియో వేడుక చేస్తారు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.