Begin typing your search above and press return to search.

పోస్టర్ టాక్: సామి స్టయిల్ సేమ్

By:  Tupaki Desk   |   18 May 2018 4:42 AM GMT
పోస్టర్ టాక్: సామి స్టయిల్ సేమ్
X
అపరిచితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విక్రమ్. దాంతో అతడి సినిమాలు తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజవడం మొదలెట్టాయి. విక్రమ్ కు ఆ స్థాయి హిట్ మళ్లీ రాలేదు. వరస ఫ్లాపులతో అతడికి ఇక్కడ క్రేజ్ కూడా బాగా తగ్గింది. ఒకప్పుడు స్టార్ హీరోలతో సమానంగా రిలీజయ్యే విక్రమ్ సినిమాలు ఇప్పుడు చడీచప్పుడు లేకుండా వచ్చి వెళ్లిపోతున్నాయి.

విక్రమ్ కెరీర్ మొదట్లో అతడికి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చింది సామి సినిమా. ఇందులో విక్రమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఈ మూవీని బాలకృష్ణ హీరోగా లక్ష్మీనరసింహ పేరుతో రీమేక్ చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు సామి స్క్వేర్ పేరుతో ఆ మూవీకి సీక్వెల్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. తిరునెల్వేలి హైవేపై ఉన్న మైల్ స్టోన్ మీద విక్రమ్ విగ్రహం రూపంలో ఉన్నట్టు స్టార్టింగ్ లో చూపారు. సింహం జూలు విదిల్చే టైపులో విగ్రహం ఒళ్లు విరుచుకుంటే పోలీస్ ఆఫీసర్ గా విక్రమ్ మారేలా గ్రాఫిక్స్ తో అదరగొట్టారు.

సింగం సిరీస్ తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న హరి సామి సీక్వెల్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా సింగం 1 - 2లకు సూపర్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ నే ఎంచుకున్నాడు. సింగం-3కి హారిస్ జైరాజ్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు హరి. అతడి మ్యూజిక్ సినిమాకు ప్లస్సవకపోగా మైనస్ అయింది. ఈసారి తీస్తోంది మాస్ ఎంటర్ టెయినర్ కావడంతో దానిలో స్పెషలిస్టయిన దేవిని ఏరికోరి తీసుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా సామిలో కనిపించినంత స్టయిల్ గా ఇప్పటికీ విక్రమ్ కనిపించి వావ్ అనిపించేశాడు.

వీడియో కోసం క్లిక్ చేయండి