బెల్లకొండ బడ్జెట్ల పై సాక్ష్యం గుదిబండ!

Fri Aug 10 2018 23:00:27 GMT+0530 (IST)

మహేష్ బాబు 'టక్కరిదొంగ' సినిమాలో టైటిల్ సాంగ్ సూపర్ గా ఉంటుంది "నలుగురికీ నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. ' అంటూ మిగతా గుంపు వేరు నేను వేరు అన్నట్టుగా సాగుతుంది.  మరి మన బెల్లంకొండ శ్రీనివాస్ అలా ఫిక్స్ అయ్యాడో ఏమోగానీ పెద్ద పెద్ద స్టార్ హీరోల పుత్ర రత్నాల సినిమాలకు లేని బడ్జెట్లు ఈ బెల్లంకొండ సినిమాలకు ఉంటాయి. అంతెందుకు.. మీడియం రేంజ్ స్టార్ హీరో లకు కూడా ఆ బడ్జెట్లు ఉండవు. ఈ బెల్లకొండ బాబు లాస్ట్ సినిమా 'సాక్ష్యం' రూ. 42 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందట.  కానీ సినిమా తుస్సుమనడంతో ఆ పంచభూతాల ఎఫెక్ట్ ఇప్పుడుబెల్లంకొండ తాజా చిత్రాలపై పడిందట.బెల్లంకొండ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు కదా.  ఈ సినిమా బడ్జెట్ లో 30% కాస్ట్ కటింగ్ జరిగిందని టాక్. అంతే కాదు.  బెల్లంకొండ శ్రీనివాస్ వంశధార క్రియేషన్స్ బ్యానర్ లో మరో సినిమా కూడా చేస్తున్నాడట. ఈ సినిమా కూడా బెల్లంకొండ స్టైల్ భారీ బడ్జెట్ చిత్రమే కానీ  'సాక్ష్యం' పంచ భూతాలు ఆ సినిమా బడ్జెట్ ను కూడా సవరించేలా చేశాయట.  పంచభూతాలు 'సాక్ష్యం'గా ఉంటాయని అంటే ఏదో అనుకున్నారు ప్రేక్షకులు.. చివరికి బెల్లంకొండ బడ్జెట్లు సవరించేలా చేస్తున్నాయి.

వీటి సంగతేమో గానీ ఇప్పటివరకూ బెల్లంకొండ మార్కెట్ స్టామినా 'ఇంత' అని ఎవరికీ తెలీదు. తలలు పండిన ట్రేడ్ పండిట్ల కు కూడా అంతు చిక్కడం లేదు.  మరి ఈ బాబుపై అంతంత భారీ బడ్జెట్ లు బయట అందరూ అనుకుంటున్నట్టు వాళ్ళ తండ్రిగారి సహకారంతో సాధ్యమౌతున్నాయేమో. ఈ సారి ఆయనకు కుడా కష్టమైందో ఏమో.. !