Begin typing your search above and press return to search.

కొట్టేసుకోవడానికి ప్రభాస్ రెడీ

By:  Tupaki Desk   |   11 Dec 2017 5:01 AM GMT
కొట్టేసుకోవడానికి ప్రభాస్ రెడీ
X
బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో అత్యంత బారి బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మరో చిత్రం సాహో. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నైయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్ర యూనిట్ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించింది. అయితే మరికొన్ని రోజుల్లో చిత్ర బృందం కొన్ని బారి యాక్షన్ సన్నివేశాల కోసం దుబాయ్ వెళ్లనుంది.

ఇప్పటికే ప్రభాస్ యాక్షన్ సీన్స్ కోసం తన బాడీని చాలా వరకు మార్చుకున్నాడు. ప్రముఖ హాలీవుడ్ మూవీస్ డై హార్డ్‌ - ట్రాన్స్‌ ఫార్మర్స్‌ వంటి సినిమాలకు పనిచేసిన యాక్షన్ కోరియేగ్రాఫర్ కెన్నీ బేట్స్ 20 నిమిషాల యాక్షన్ సన్నివేశాలను దుబాయ్ లోని అతి ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫాలో చిత్రీకరించనున్నాడు. పెద్ద పెద్ద ట్రక్స్ కార్స్ తో ఛేజింగ్ ఫైట్ ఉండనుందట. సినిమాలో ఆ సీన్స్ చాలా హైలెట్ అవ్వనున్నాయట. ప్రభాస్ కూడా కొట్టేసుకుందామా అంటూ తనదైన స్టయిల్లో ఈ స్టంట్లు చేయనున్నాడట.

ఇకపోతే ఈ సీన్ల తాలూకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను వారు పూర్తి చేసేశారట. జనవరిలో న్యూ ఇయర్ వేడుకలు ముగియగానే సాహో టీమ్ అక్కడికి వెళ్లనుంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ దాదాపు 150కోట్లతో తెరకెక్కనుంది. ప్రభాస్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.