Begin typing your search above and press return to search.

సైరాను అలెర్ట్ చేసిన సాహో

By:  Tupaki Desk   |   18 July 2019 5:48 AM GMT
సైరాను అలెర్ట్ చేసిన సాహో
X
వాస్తవానికి సాహోకు సైరాకు కనెక్షన్ లేకపోయినా మేకింగ్ లోనూ ఇబ్బందులు పడటంలోనూ రెండింటికి దగ్గరి పోలిక చాలా ఉంది. సైరాకు ముందు ఏఆర్ రెహమాన్ ను అనౌన్స్ చేశారు. కానీ నేను చేయలేను అంటూ ఆయనే స్వయంగా తప్పుకున్నారు. సాహోకు ఫస్ట్ శంకర్ ఎహసాన్ లాయ్ ను తీసుకున్నారు. డేట్ అనౌన్స్ చేసే టైంలో మేము ఈ ప్రాజెక్ట్ లో లేమని సోషల్ మీడియాలో ప్రకటించారు. రెండు సినిమాలకూ పాటల కోసం బాలీవుడ్ సంగీత దర్శకులు రీ ప్లేస్ అయ్యారు. సాహో బీజీఎమ్ జిబ్రాన్ ఇస్తుండగా సైరా కోసం జూలియస్ పకీయం రంగంలోకి దిగుతున్నాడని టాక్ ఉంది కానీ ఇంకా ఖరారు కాలేదు.

బడ్జెట్ రెండు సినిమాలకూ అటు ఇటుగా రెండు వందల కోట్ల దాకా అయ్యింది. ప్రభాస్ చిరుల కెరీర్లలో ఇవే మోస్ట్ క్రేజీ అండ్ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు సాహో ఆగస్ట్ 15 వస్తుంది అనుకుంటే వాయిదా వార్తతో ప్రకంపనమే సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్ పని పూర్తి కాకపోవడం - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం జిబ్రాన్ ఎక్కువ సమయం కావాలని కోరడం - ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడానికి టైం ఎక్కువగా లేని కారణాల వల్ల మొత్తానికి సాహో మాట తప్పాల్సి వచ్చింది. ఇక్కడ అలెర్ట్ అవ్వాల్సింది సైరా కూడా.

ఇవే ఇబ్బందులను పేస్ చేస్తున్న కొణిదెల టీమ్ టార్గెట్ పెట్టుకున్న రిలీజ్ డేట్ అక్టోబర్ 2కు ఇంకా మూడు నెలలు ఉంది కాబట్టి ఆలోగా ప్రతిదీ సాఫీగా జరిగేలా ప్లానింగ్ చేసుకుంటే మంచిది. చివరి నిమిషం వరకు హడావిడి పడడానికి సైరా కమర్షియల్ సినిమా కాదు ఏదైనా కొంచెం తేడా వస్తే కవర్ చేయడానికి. సో సాహో వాయిదా కారణాలు నిశితంగా పరిశీలించి సైరాకు అవి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రామ్ చరణ టీమ్ మీద ఉంది. ఏడాది క్రితం రిలీజ్ చేసిన టీజర్ తర్వాత సైరా నుంచి ఎలాంటి యాక్టివ్ ప్రమోషన్ లేదు.