Begin typing your search above and press return to search.

ఫ్లాష్ ఫ్లాష్ - సాహో వాయిదా ?

By:  Tupaki Desk   |   16 July 2019 11:35 AM GMT
ఫ్లాష్ ఫ్లాష్ - సాహో వాయిదా ?
X
అనుకున్నంతా అయ్యింది. నెల రోజుల కంటే తక్కువ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు భారీ స్థాయిలో ప్రమోషన్ ఎలా చేస్తారా అని భయపడినట్టుగానే సాహో రిలీజ్ ని వాయిదా వేసినట్టుగా తెలిసింది. ముందు ప్రకటించిన ఆగస్ట్ 15 కాకుండా రెండు వారాలు లేట్ గా ఆగస్ట్ 30కి విడుదల చేయాలని డిసైడ్ చేసినట్టుగా టాక్. నిర్మాణాంతర పనులతో పాటు డబ్బింగ్ వర్క్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయట. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కడ చేయాలి అనే దాని గురించి ఇంకా ఓ క్లారిటీకి రాలేకపోతున్నారట.

ఇంత ఒత్తిడిలో కేవలం మూడున్నర వారాల వ్యవథిలో డెడ్ లైన్ మీట్ కావడం కష్టమని భావించి మొత్తానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అఫీషియల్ గా ప్రకటన మరికాసేపట్లో రావొచ్చు. సాహో కోసం అభిమానులే కాదు సామాన్య ప్రేక్షకులు కూడా చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. తెలుగు తెరపై మాత్రమే కాదు ఇండియన్ స్క్రీన్ మీదే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన సాహో మీద అంచనాల గురించి చెప్పాలంటే అదొక పెద్ద పుస్తకమే అవుతుంది.

అందుకే ఒత్తిడి పడి పనులు చేస్తే అసలుకె మోసం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నెల రోజులకు పైగా టైంని పక్కాగా ప్లాన్ చేసే ఉద్దేశంతో సాహోని ఆగస్ట్ 30కి లాక్ చేసినట్టుగా తెలిసింది. ఇది డార్లింగ్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే న్యూస్ అయినప్పటికీ గ్యాప్ రెండు వారాలే కాబట్టి సర్దుకోకతప్పదు. ఆ టైంకి పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. ఈ వాయిదా వల్ల మిషన్ మంగళ్-బాట్లా హౌస్ భారీ లబ్ది పొందబోతున్నాయి. సాహో పోన్ గురించి అఫీషియల్ న్యూస్ ఇంకా రావాల్సి ఉంది