Begin typing your search above and press return to search.

ఎక్క‌డ మొద‌లైందో అక్క‌డే ముగింపు

By:  Tupaki Desk   |   20 April 2019 4:30 AM GMT
ఎక్క‌డ మొద‌లైందో అక్క‌డే ముగింపు
X
2019 మోస్ట్ అవైటెడ్ మూవీ `సాహో` ఆగ‌స్టు 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత డార్లింగ్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఇప్ప‌టికే `సాహో` మేకింగ్ వీడియోలు యూట్యూబ్ లో కోట్లాది వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ప్ర‌భాస్ న్యూ లుక్.. శ్ర‌ద్ధా క‌పూర్ యాక్ష‌న్ క్వీన్ లుక్ అభిమానుల‌కు పిచ్చిగా న‌చ్చేశాయి. నెటిజ‌నుల్లో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. సాహో ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే నెవ్వ‌ర్ బిఫోర్ అన‌ద‌గ్గ యాక్ష‌న్ సినిమా అని టీమ్ చెబుతోంది. అందుకోసం యు.వి.క్రియేష‌న్స్ సంస్థ 225- 300 కోట్ల మేర బ‌డ్జెట్ ని వెచ్చిస్తోంద‌ని ప్ర‌చార‌మైంది. ఈ సినిమాని చెప్పిన టైమ్ కి రిలీజ్ చేసేందుకు ప్ర‌స్తుతం రేయింబ‌వ‌ళ్లు నిరంత‌రాయంగా శ్ర‌మిస్తున్నారు.

ఇంత‌కీ చిత్రీక‌ర‌ణ ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చింది? అంటే ముగింపు ద‌శ‌లో ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం సాహో టీమ్ ముంబైలో ఉంది. అక్క‌డ ప్ర‌ధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లోనూ యాక్షన్ స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నార‌ని తెలుస్తోంది. ``ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది`` అని ద‌ర్శ‌కుడు సుజీత్ అన్నారు. అంటే ముంబైలో ప్రారంభించారు కాబ‌ట్టి అక్క‌డే ముగిస్తున్నారా? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. సుజీత్ చాలా గ్యాప్ త‌ర్వాత ఇన్ స్టాగ్ర‌మ్ లో అభిమానుల కోసం ఓ ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో న‌గ‌రాన్ని తీక్ష‌ణంగా ప‌రిశీలిస్తున్న సుజీత్ క‌నిపించారు.

`సాహో` చిత్రంలో నీల్ నితిన్ పాత్ర ప్ర‌భాస్ రోల్ కి ధీటుగా ఉంటుంద‌ని తెలిసింది. నీల్ నితిన్ విల‌న్ గా అద్భుత విన్యాసాలు చేయ‌బోతున్నాడ‌ట‌. జాకీష్రాఫ్-మందిరా బేడీ- అరుణ్‌ విజయ్- వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి శంకర్‌-ఎహసన్‌-లాయ్‌ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌భాస్ స్నేహితులు వంశీ- ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అనంత‌రం ప్ర‌భాస్ పూర్తిగా `జాన్` పై దృష్టి సారించ‌నున్నార‌ట‌. యూర‌ప్ బ్యాక్ డ్రాప్ లో జిల్ రాధాకృష్ణ ఈ ప్రేమ‌క‌థా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.