Begin typing your search above and press return to search.

చైతూ కొత్త టీజర్ తో వచ్చాడు

By:  Tupaki Desk   |   5 May 2016 1:53 PM GMT
చైతూ కొత్త టీజర్ తో వచ్చాడు
X
ఎప్పుడో ఆర్నెల్ల ముందు విడుదల కావాల్సిన సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయినప్పటికీ సినిమా మీద క్రేజ్ ఏమీ తగ్గలేదు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా జనాలకు పరిచయం చేసిన ప్రతి విశేషం ఆకట్టుకునేలా ఉండటమే దీనికి కారణం. ఫస్ట్ టీజర్.. రెండో టీజర్.. ఎల్లిపోమాకే సాంగ్.. అన్నీ కూడా చాలా రిచ్‌గా.. ఆసక్తికరంగా ఉండి.. సినిమా మీద ఆసక్తిని పెంచాయి. ‘ఎల్లిపోమాకే..’ పాట రిలీజైన నాటి నుంచి ఎఫ్ఎం రేడియోల్లో.. సంగీత ప్రియుల మొబైల్స్‌లో మార్మోగుతూనే ఉంది. ఇప్పుడు ఇంకో కొత్త పాటతో జనాల ముందుకొచ్చాడు చైతూ.

ఈ రోజే ‘సాహసం శ్వాసగా సాగిపో’లోని మరో పాటు ‘షోకిల్లా’ ఆడియో టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఫాస్ట్ బీట్ తరహాలో ఉంది. ఈ పాట మేకింగ్ విజువల్స్ కూడా యాడ్ చేసి టీజర్ రిలీజ్ చేశారు. ఇక రాబోయే రెండు వారాల్లో సినిమాలోని మిగతా పాటల టీజర్లు కూడా వరుసగా వదుల్తారట.

ఈ నెల మూడో వారంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆడియో విడుదల కాబోతోంది. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ‘ఏమాయ చేసావె’ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన సినిమా ఇది. మలయాళ భామ మాంజిమా మోహన్ కథానాయిక. తమిళంలో ఇదే సినిమాను శింబు కథానాయకుడిగా తెరకెక్కించాడు గౌతమ్. జూన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.