Begin typing your search above and press return to search.

బడి కట్టించిన జక్కన్న!!

By:  Tupaki Desk   |   16 Jan 2018 10:46 AM GMT
బడి కట్టించిన జక్కన్న!!
X
ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పుడు కేవలం టాలీవుడ్ దర్శకుడు మాత్రమే కాదు.. దేశీయ చలన చిత్ర పరిశ్రమకే దర్శకధీరుడు. బాహుబలి సిరీస్ తో ఈయన సాధించిన ఘనవిజయం అసామాన్యం. ఒకవైపు ప్రొఫెషనల్ గా బిజీగా ఉంటున్న జక్కన్న.. మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు.

స్వయంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే జక్కన్న.. మరోవైపు కొన్ని సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గంటూ ఉంటాడు. విశాఖపట్నం జిల్లా కశింకోటలో.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం కోసం.. రాజమౌళి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏకంగా 40 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చి.. ఓ భవన నిర్మాణానికి సాయం చేశారు రాజమౌళి. ఆ భవనానికి రాజమౌళి తల్లి రాజనందిని పేరు పెట్టడం విశేషం. 2014లో వచ్చిన హుధూద్ తుఫాన్ కారణంగా.. విశాఖ జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అనేక భవనాలు కూలిపోగా.. వీటిలో 154 ఏళ్ల చరిత్ర ఉన్న కశింకోట హైస్కూల్ కూడా పాడయిపోయింది.

2015లో ఈ భవన నిర్మాణం ప్రారంభం కాగా.. ఇప్పుడీ బిల్డింగ్ పూర్తయిపోయింది. శిలా ఫలకంపై రాజమౌళితో పాటు శోభనాద్రి.. ప్రశాంతి.. కీరవాణిల పేర్లు దర్శనం ఇస్తాయి. సామాజిక సేవ కోసం ఉదాత్తంగా వ్యవహరించి 40 లక్షల విరాళం ఇచ్చి అనేక మంది విద్యార్ధులకు ఉపయోగపడే పాఠశాల నిర్మాణానికి సాయం చేయడంతో.. రాజమౌళిని అందరూ కొనియాడుతున్నారు.