మహానేతపై జక్కన్న - ఎన్టీఆర్ ఇలా

Thu Aug 16 2018 22:34:15 GMT+0530 (IST)

మహానాయకుడు .. ఉక్కు సంకల్ప ధీరోదాత్తుడు అయిన వాజ్ పేయ్ మరణంపై సినీపరిశ్రమ ప్రముఖులు ఒపీనియన్స్ వెబ్‌ని వేడెక్కిస్తున్నాయ్. ఇందులో ఎస్.ఎస్.రాజమౌళి - ఎన్టీఆర్ - రానా - అల్లరి నరేష్ - సురేష్ ప్రొడక్షన్స్ స్పందనలు ఆసక్తి రేకెత్తించాయి.రాజకీయాలకే వన్నె తెచ్చారు - ఎస్.ఎస్.రాజమౌళి

దేశంలోనే అరుదైన రాజకీయనేత వాజ్ పేయ్. రాజకీయాలకే వన్నె తెచ్చిన ఆయన మరణం బాధాకరం. దేశంలో రహదారుల నిర్మాణం అన్న వాజ్ పేయ్ కల కోట్లాది ప్రజల జీవితాల్ని మార్చింది. ఆయన లేని లోటు తీరనిది.

గ్రేట్ లీడర్ కి శాల్యూట్- ఎన్టీఆర్

మన దేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన గొప్ప నాయకుల్లో వాజ్ పేయీ ముందు వరుసలో ఉంటారు. అసమాన రాజనీతిజ్ఞుడు - ధైర్యశాలి. ఆయన విజన్ కారణంగానే స్వర్ణ చతుర్భుజితో దేశంలోని ప్రాంతాలన్నీ చక్కగా ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యాయి. అటల్‌జీ మన గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటారు. చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప నాయకుడికి సెల్యూట్.

గొప్ప కవి - నేతను కోల్పోయాం- రానా

నేడు ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం. గొప్ప రచయిత.. ఆదర్శవాదిని పోగొట్టుకున్నాం. దేశాన్ని గొప్పగా తయారు చేయాలని కలగన్న ఒక మహానాయకుడిని కోల్పోవడం బాధ కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.

ప్రఖ్యాత సినీనిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వాజ్ పేయ్ కి ప్రత్యేకంగా నివాళి తెలిపింది. మహానాయకుడు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఆయన మరణానికి నివాళిగా మా సినిమాల  ప్రమోషన్ కార్యక్రమాల్ని నిలిపి వేస్తున్నామని ప్రకటించింది. అటల్ బిహారీ వాజ్ పేయ్ ఆత్మకు శాంతి కలగాలని సురేష్ ప్రొడక్షన్స్ సామాజిక మాధ్యమ ముఖంగా కోరింది. వాజ్ పేయ్ తో డా.డి.రామానాయుడు ఉన్నప్పటి ఫోటోని అభిమానుల కోసం షేర్ చేసింది. నటి గౌతమి - అల్లరి నరేష్ - కాజల్ - మంచు విష్ణు - మారుతి - బివిఎస్.రవి వాజ్ పేయ్ మహానేత మరణానికి చింతిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.