Begin typing your search above and press return to search.

రాజమౌళి కుడిభుజం ఏమంటున్నాడంటే

By:  Tupaki Desk   |   30 April 2017 10:30 AM GMT
రాజమౌళి కుడిభుజం ఏమంటున్నాడంటే
X
బాహుబలి సినిమా ప్రభంజనం కేవలం వసూళ్ళపరంగానే కాదు.. అసలు మన సినిమాల ప్రొడక్షన్ స్థాయిని మార్కెట్ని పెంచిన సినిమాగా మన చెప్పుకోవాలి. ఇంత పెద్ద ప్రాజెక్టు విజయవంతం కావడానికి దాని క్రెడిట్ మొత్తం కెప్టెన్ రాజమౌళితో పాటు అతని టీమ్ అండ్ ఫ్యామిలికి కూడా దక్కుతుంది. ఎందుకంటే అతని భార్య రమతో పాటు.. కొడుకు కూడా కార్తికేయ సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పనిచేశాడు. బాహుబలి ప్రోమోలు కూడా కట్ చేశాడు. బాహుబలి అనుభవాలు అతని మాటలలోనే వినండి.

''బాహుబలి మొదటి భాగంలో విగ్రహం ఎత్తిన సీన్ లో ఇన్సెట్ షాట్స్ అన్నీ నేనే తీశాడు. తాడు లాగడం.. పాదాలు కదిలే షాట్లతో మొదలైంది నా డైరక్షన్ కెరీర్. నాకు ప్రొడక్షన్ బాగా తెలుసు అందుకే బాహుబలి మొదటి భాగంలో ప్రొడక్షన్ లో పని చేశాను. బాహుబలి 2 లో మాత్రం వార్ సీన్ లు ఎక్కువ డైరక్షన్ చేసాను. నేను ఒక సారి ఒక షాట్ ని 22 టేక్లు తీశాను. బాబా (రాజామౌళి) కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో అలా చేసేవారు. ఆయన ఏమో పెర్ఫెక్షెన్ కోసం తీస్తే నేను చేతకాక తీశా అదే తేడా'' అంటూ నవ్వేశాడు కార్తికేయ.

''నాకు మొదటి నుండి ఎడిటింగ్ అంటే ఇష్టం. ఛత్రపతి టైమ్ లో ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశా. ఈగ సినిమా తరువాత నుండి షోయింగ్ బిజినెస్ అని నా సొంత ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశా. అలాగే బాహుబలి లో నటించిన వారు అందరూ ఇష్టమే కాన్ని రానా అంటే ఎక్కువ ఇష్టం. బహుశ కలిసి ఎక్కువ పనిచేయడం ఏమో. రానాను చాలా సీన్లలో నేను డైరక్ట్ చేశాను'' అని చెప్పాడు.

''నేను చిన్నపుడు నాన్నకు తెలియకుండా గ్లాస్ పెయింటింగ్ వేసి మా వీదిలోనే అమ్మేవాడిని'' అంటూ ఎవ్వరికీ చెప్పని సీక్రెట్ కూడా బయటపెట్టాడు. భవిష్యుత్ లో రాజమౌళి కుడిభుజం ఫిల్మ్ ప్రొడక్షన్ తో పాటు డైరక్షన్ కూడా చేస్తాడు అన్నమాట. మరి ఇంకేమి మరో స్టార్ట్ డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ గా తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/