Begin typing your search above and press return to search.

మిల్కీ జోరు చూపించినా స్పీడుకు చుక్కలే

By:  Tupaki Desk   |   7 Feb 2016 11:30 AM GMT
మిల్కీ జోరు చూపించినా స్పీడుకు చుక్కలే
X
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన రెండో సినిమా స్పీడున్నోడు థియేటర్లలోకి వచ్చింది. తమన్నా చేసిన ఐటెం సాంగ్ ని.. విపరీతంగా ప్రచారం చేసుకుంటూ వెండితెరపై వెలిగిపోయేందుకు గట్టిగానే ప్రయత్నించాడు బెల్లంకొండ. ఈ కుర్రాడు నటించిన మొదటి సినిమా అల్లుడు శీను విషయంలో.. నిర్మాత - హీరో తండ్రి బెల్లంకొండ సురేష్ కు కమర్షియల్ గా కలిసొచ్చిందేమీ లేదు. భారీ పెట్టుబడి పెట్టి తీసి.. యావరేజ్ రేట్లకు ఇవ్వడంతో.. డిస్ట్రిబ్యూటర్లకు బాగానే వర్కవుట్ అయింది.

కానీ అల్లుడు శీను విషయంలో లెక్క వేరు. హీరో ఒక్కడు తప్ప మిగతా అంతా స్టార్లే. హీరోయిన్ గా సమంత - మిల్కీ బ్యూటీ తమన్నా ఐటెం సాంగ్ - వివి వినాయక్ డైరెక్షన్.. ఇలా అన్ని అంశాలు కలిసొచ్చాయి. కానీ ఇక్కడ స్పీడున్నోడు విషయంలో అంత క్రేజ్ లేదు. కేవలం తమన్నా సాంగ్ ఒకటే సెల్లింగ్ పాయింట్. అందుకే బాచిలర్ బాబును అడ్డం పెట్టుకుని బాగా ప్రచారం చేసుకున్నారు. అయినా సరే రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయికి అల్లంత దూరాన్నే ఉండేట్టుగా ఉంది.

తమన్నా ఐటెం సాంగ్ ని సెంటిమెంట్ గా భావించి భారీ మొత్తం ఇచ్చి చేయించుకున్నారు. అయితే.. మొదటి రోజు పర్లేదనిపించిన వసూళ్లు.. రెండో రోజు కల్లా భారీగా పడిపోయాయి. దీంతో పెట్టుబడి పెట్టినవాళ్లకు బెంగ పట్టుకుంది. స్పీడున్నోడిని హిట్ అనాలంటే కనీసం 20 కోట్ల మొత్తం రాబట్టాలి. బాహుబలి - బెంగాల్ టైగర్ లతో హిట్స్ జోష్ లో ఉన్న తమన్నా జోరు కూడా స్పీడున్నోడుకి కిక్ ఇవ్వలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.