Begin typing your search above and press return to search.

మరోసారి అందరినీ థ్రిల్ చేసిన సూర్య

By:  Tupaki Desk   |   20 May 2019 1:30 AM GMT
మరోసారి అందరినీ థ్రిల్ చేసిన సూర్య
X
ఎస్జే సూర్య పేరు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. దర్శకుడిగా బ్లాక్ బస్టర్ సినిమాలకు.. డిజాస్టర్లకు కూడా దర్శకత్వం వహించాడు. ఆయన లిస్టులో 'వాలి'.. 'ఖుషి' లాంటి బ్లాక్ బస్టర్లతో పాటుగా 'నాని'.. 'కొమరం పులి' లాంటి డిజాస్టర్లు ఉన్నాయి. ఇక దర్శకుడిగా వరస ఫెయిల్యూర్లు చూస్తున్న సమయంలో కార్తిక్ సుబ్బరాజ్ సినిమా 'ఇరైవి' సినిమాలో నటించడం ఎస్ జే సూర్య కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత దర్శకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టి పూర్తి స్థాయి నటుడిగా కొనసాగుతున్నాడు. మహేష్ బాబు 'స్పైడర్' సినిమా ఫ్లాప్ అయింది కానీ అందులో ఎస్ జే సూర్య మాత్రం విలన్ గా తన నటనతో అందరినీ మెప్పించాడు.

తాజాగా ఎస్జే సూర్య హీరోగా నటించిన 'మాన్ స్టర్' అనే తమిళ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు నెల్సన్ వెంకటేశన్ కాగా హీరోయిన్ గా ప్రియ భవాని శంకర్ నటించింది. ఈ సినిమాలో మధ్యతరగతి వ్యక్తిగా ఒక ఎలుక వల్ల కష్టాలు పడే పాత్రలో సూర్య నటించాడు. ఈ శుక్రవారమే రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక సూర్య నటనకు క్రిటిక్స్ కూడా జేజేలు పలుకుతున్నారట. నటుడిగా సూర్య టాలెంట్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందంటే ఏ రేంజ్ లో ఆ పాత్రను ఉతికి ఆరేశాడో మనం అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమా నటుడిగా ఎస్ జే సూర్యకు ఒక మరపురాని చిత్రమని అంటున్నారు. ఈ సినిమా సంగతి ఇలా ఉంటే ఎస్జే సూర్య చేతిలో ప్రస్తుతం అర డజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయట. అంటే ఇక సూర్యను మెగా ఫోన్ పట్టనివ్వకుండా సూర్యను అవకాశాల వర్షంలో ముంచేస్తున్నట్టే.