Begin typing your search above and press return to search.

సైమా.. వాళ్ళని మర్చిపోయారేమ్మా??

By:  Tupaki Desk   |   25 May 2016 5:30 PM GMT
సైమా.. వాళ్ళని మర్చిపోయారేమ్మా??
X
మనకు నంది అవార్డులు తప్పించి మరో అవార్డులు ఫేమస్ కాదు. అయితే ఈ మధ్యనే సౌత్‌ లోని నాలుగు టిన్సెల్ టౌన్స్ కూ కలిపి ఫిలింఫేర్‌ వారు అవార్డులు ఇస్తున్నారు. కాని బాలీవుడ్‌ మీద పెట్టినంత ఫోకస్ వారు మన మీద పెట్టరు. అందుకే మనోళ్లు చేస్తున్న ''సైమా అవార్డ్స్'' ఇప్పుడు బాగా ఫేమస్‌ అయిపోయింది. ఈ ఏడాది జూలై 1వ వారంలో జరిగే ఈ అవార్డులకు ఇప్పుడు నామినేషన్లు ప్రకటించారు కూడా.

యథావిథిగా ఎప్పుడూ ఉన్నట్లే ఈ ఏడాది కూడా నామినేషన్లపై కొంతమంది స్టార్‌ హీరో హీరోయిన్ల అభిమానులు చాలా డిజప్పాయింట్‌ అయ్యారు. బెస్ట్ యాక్టర్ క్యాటగిరీలో ''టెంపర్‌''లో నటనకు గాను ఎన్టీఆర్ పేరు లేకపోవడం.. అలాగే బెస్ట్ యాక్ర్టెస్‌ క్యాటగిరీలో ''బాహుబలి''లో చేసిన అందాల ఆరబోతకు తమన్నా పేరు లేదేంటి అంటూ ఇప్పుడు అభిమానులు గోల చేస్తున్నారు. ఈ సినిమాల్లో వారు బెస్ట్‌ నటన కనబర్చారా లేదా అనేకంటే.. అక్కడున్న నామినేషన్లలో ఒకటి రెండు యాక్టర్ల కంటే వీరే బాగా యాక్ట్‌ చేశారనేది ఫ్యాన్స్ మేజర్ ఆరోపణ. నిజంగానే ఎన్టీఆర్ అండ్‌ తమన్నాను సైమా మర్చిపోయిందేమో అనిపిస్తోంది కూడా.

ఇకపోతే బెస్ట్ యాక్టర్ కేటగిరీలో.. ప్రభాస్‌ (బాహుబలి) - మహేష్‌ (శ్రీమంతుడు) - నాని (భలే భలే మగాడివోయ్‌) - వరుణ్‌ తేజ్‌ (కంచె) అండ్‌ అల్లు అర్జున్ (రుద్రమదేవి) పేర్లు నామినేట్‌ అయ్యాయ్. అలాగే ఉత్తమ నటి అవార్డుకు సమంత (సన్నాఫ్‌ సత్యమూర్తి) - శృతి హాసన్‌ (శ్రీమంతుడు) - నిత్య మీనన్‌ (మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు) - లక్ష్మీ మంచు (దొంగాట) - అనుష్క (రుద్రమదేవి) పేర్లు నామినేట్‌ అయ్యాయ్. అది సంగతి.