Begin typing your search above and press return to search.

మోషన్ పోస్టర్: రంగంలోకి దూకేస్తున్న సింగం

By:  Tupaki Desk   |   28 Oct 2016 5:09 AM GMT
మోషన్ పోస్టర్: రంగంలోకి దూకేస్తున్న సింగం
X
ఎస్3 పేరుతో తెరకెక్కుతున్న సింగం సిరీస్ లో మూడో సినిమాపై కోలీవుడ్ లో బోలెడన్ని అంచనాలున్నాయి. ఈ సిరీస్ లో గత రెండు చిత్రాలు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ రికార్డులు సృష్టించేశాయి. ఇప్పుడు మూడో పార్ట్ ను కూడా దాదాపు రిలీజ్ కి రెడీ చేసేసిన సూర్య.. మరోవైపు ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టేశాడు. ఇప్పుడు దీపావళి స్పెషల్ గా మోషన్ పోస్టర్ ను లాంఛ్ చేసింగి సింగం యూనిట్.

అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండానే ఎస్ 3 మోషన్ పోస్టర్ ఉందని చెప్పాలి. వన్.. టూ నెంబర్లను దాటుకుంటూ.. సింహం మూడో నెంబర్ దాటడంతో స్టార్ట్ చేసి.. చివరకు సింహం పాదాన్ని సూర్య షూ కింద మార్చేశారు. ఆ తర్వాత గ్రాఫిక్ వర్క్ తోనే తల వరకూ తీసుకొచ్చి.. చివరకు మాత్రం సూర్య ఫేస్ ని సీరియస్ గా డిస్ ప్లే చేశారు. మళ్లీ సూర్య మొహాన్ని సింహం అరుస్తున్నట్లుగా మార్చేసి మోషన్ పోస్టర్ ఫినిష్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.

నిజానికి ఎస్3 దీపావళికే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ తమ్ముడు కాష్మోరా కోసం వాయిదా వేసుకున్న సూర్య.. ఈ పండక్కి ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచకుండా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే నవంబర్ 7న టీజర్ రిలీజ్ అంటూ సూర్య టీజ్ చేస్తున్నాడండోయ్.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/