Begin typing your search above and press return to search.

అల్లు దెబ్బకి సింగం తెగ్గినట్లున్నాడే

By:  Tupaki Desk   |   2 Dec 2016 5:30 PM GMT
అల్లు దెబ్బకి సింగం తెగ్గినట్లున్నాడే
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సిరీస్ మూడో భాగం ఎస్ 3ని డిసెంబర్ 16న రిలీజ్ చేస్తామని మూడు నెలలకు ముందే డేట్ ఇచ్చారు. నెలన్నర ముందే అన్ని పనులు పూర్తి చేసేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి ఇప్పటికే ప్రమోషన్స్ వీర లెవెల్లో చేస్తున్నారు.

ఇప్పుడు సడెన్ గా ఎస్3 విడుదల తేదీ మారిందని అనౌన్స్ మెంట్ వచ్చేసింది. డిసెంబర్ 16న కాకుండా.. డిసెంబర్ 23న విడుదల చేస్తున్నట్లు చెప్పారు నిర్మాతలు. తెలుగు-తమిళ్ రెండుభాషల్లోనూ రిలీజ్ డేట్ ఇదే. సాంకేతిక కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చిందన్నది దర్శక నిర్మాతల ఆలోచన. పైకి ఇలా చెబుతున్నా.. ఎస్3 రిలీజ్ డేట్ మారడం వెనక ధృవ నిర్మాతగా అల్లు అరవింద్ ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. గజినీ డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినప్పటి నుంచి అల్లు అరవింద్-సూర్యల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీని ఆధారంగానే.. ఈనెల 9న థియేటర్లలోకి వస్తున్న ధృవ కోసం.. సింగం3ని ఓ వారం వెనక్కు జరపాల్సింగా సూర్యతో మాటా మంతి జరిపారనే టాక్ ఉంది.

ఇప్పుడు అల్లు మంత్రాంగం ఫలించిందనే చెప్పుకోవాలి. సింపుల్ గా సాంకేతిక కారణాలు పేరు చెప్పి.. డిసెంబర్ 23కు ఎస్3ను పోస్ట్ పోన్ చేసేశారు. ఇది సూర్యకు కూడా ఒకరకంగా మంచిదే. చాలా థియేటర్లు ధృవకు లాక్ అయిన రెండు వారాలకు ఎస్3 వస్తుండడంతో.. స్క్రీన్ కౌంట్ మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి.