Begin typing your search above and press return to search.

అ..ఆ.. నిర్మాత ఆత్మకథ ఇదే

By:  Tupaki Desk   |   29 May 2016 9:38 AM GMT
అ..ఆ.. నిర్మాత ఆత్మకథ ఇదే
X
ఇప్పుడు సినిమా నిర్మాణానికి వాల్యూ ఉంది కానీ.. నిర్మాతకు ఏ మాత్రం విలువ లేదు. కోట్ల ధారపోసేసి సైలెంట్ గా కూర్చునేవాడే మంచి నిర్మాత అన్నట్లుగా తయారయింది ఫిలిం ఇండస్ట్రీ. ఇలాంటి పరిస్థితిలోనూ వరుసగా రెండు హిట్స్ కొట్టి హ్యాట్రిక్ కి రెడీ అయిన ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ. హారిక హాసిని బేనర్ పై జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలను తీసిన ఈయన.. ఇప్పుడు అ..ఆ.. ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

వరుసగా 3 సినిమాలు త్రివిక్రమ్ లాంటి ఒకే డైరెక్టర్ చేయడమంటే చిన్న విషయం కాదు. అలా జరగాలంటే వారి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉండాలి. అసలు ఈయన నిర్మాతగా మారడం ఇదే మొదలు కాదు. 28 ఏళ్ల క్రితమే ఆత్మకథ అనే చిత్రాన్ని తీసి ఫెయిల్ అయిన హిస్టరీ రాధాకృష్ణది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలో తన పని తాను చేసుకున్నారు. మళ్లీ చిరునవ్వుతో - నువ్వు నాకు నచ్చావ్ చూశాక.. ఇలాంటి సినిమాలు తీయాలని అనిపించించదట.

ఆ తర్వాత త్రివిక్రమ్ తో పరిచయం, కంటిన్యూగా ప్రయాణం సాగించడం జరిగిపోయాయని అంటున్నారు రాధాకృష్ణ. అయితే.. బన్నీతో వరుసగా సినిమాలు ప్లాన్ చేయలేదని.. కానీ బన్నీతో మళ్లీ మళ్లీ సినిమాలు తీయాలని అనిపిస్తోందని.. నిర్మాత - దర్శకుల అభిరుచిని అర్ధం చేసుకునే హీరో అల్లు అర్జున్ అంటున్నారు. ఇక అ..ఆ.. చిత్రంతో త్రివిక్రమ్ మరోసారి చిరునవ్వుతో నాటి రోజులను గుర్తు చేయడం ఖాయమని చెబుతుండడం విశేషం.