ఫస్ట్ పార్ట్ రన్ టైమ్ లాక్ చేసిన ఎన్టీఆర్ టీమ్

Sat Oct 20 2018 16:08:40 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ను రెండుభాగాలుగా రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.   ఇప్పటికే మొదటి భాగం 'కథానాయకుడు' షూటింగ్ కంప్లీట్ అయిందట.  క్రిష్ ఇప్పుడు 'మహానాయకుడు' షూటింగ్ తో బిజీగా ఉన్నారట.   ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయకటు వచ్చింది.ఫస్ట్ పార్ట్ ఎడిట్ కట్ ను పూర్తి చేసిన ఎన్టీఆర్ టీమ్ 2.26 నిముషాల రన్ టైమ్ ను లాక్ చేశారట. మొదట్లో ఫస్ట్ పార్ట్ లోనే పార్టీ ప్రకటన.. అధికారం సాధించడం.. ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోవడం వరకూ చూపించాలనే ఆలోచన చేశారట.  కానీ రెండవ భాగంలో పూర్తిగా రాజకీయ జీవితం చూపించాలని డిసైడ్ అయ్యారు కాబట్టి.. మొదటి భాగాన్ని తెలుగు దేశం పార్టీ ప్రకటన దగ్గరే ఆపేస్తే బాగుటుందనే నిర్ణయానికి వచ్చారట.

ఈ లెక్కన మొదటి భాగం లో ఎన్టీఆర్ బాల్యం నుండి సినిజీవిత ప్రయాణం.. రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే ఆలోచన రావడం... తెలుగు దేశం పార్టీ ఏర్పాటు ప్రకటన తో ముగుస్తుంది.  పార్టీ ప్రకటన చేసే సమయంలో బుర్రా సాయిమాధవ్ పవర్ ఫుల్ డైలాగ్స్ బాలయ్య నోట వస్తాయని అందరినీ అలరించేలా ఉంటాయని టాక్.