మోక్షజ్ఞ చుట్టూ ప్రదక్షిణాలు ఆగట్లేదు

Thu Oct 12 2017 16:38:10 GMT+0530 (IST)

నందమూరి ఫ్యామిలీ నుండి మరో వారసుడు 2018లో తెరంగేట్రం చేసే ఛాన్సుందని ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ స్వయంగా చెప్పారు. ఆయన పుత్రరత్నం మోక్షజ్ఞ కూడా సినిమాలపై మక్కువ చూపిస్తున్నట్లు.. నటనలోనూ డ్యాన్సుల్లోనూ శిక్షణ తీసుకుని ఇటుగా అడుగులు వేయనున్నట్లు తెలిపారు. అయితే మోక్షజ్ఞ గురించి ఇప్పుడు చెక్కర్లు కొడుతున్న ఒక రూమర్ ఏంటంటే.. మనోడు బాలయ్య తీయిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో చిన్ననాటి బాలయ్యగా కనిపించనున్నాడని అంటున్నారు.నిజానికి మోక్షజ్ఞ కనుక మనం సినిమాలో అఖిల్ చేసినట్లు ఒక చిన్న రోల్ చేస్తే బాగానే ఉంటుంది. అయితే ఆ చిన్న రోల్ ఎవరి పాత్రలో చేయాలి? అసలు ఈ బయోపిక్ లో.. బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పాత్రను చేస్తున్నారు కాబట్టి.. బాలయ్య పాత్రను ఎవరు చేస్తారు అనే సంశయం మొదటి నుండీ ఉన్నదే. చిన్ననాటి బాలయ్య పాత్రను మోక్షజ్ఞ చేస్తే కనుకు.. ఆ తరువాత పెద్దయ్యాక బాలయ్య పాత్రను ఎవరు చేస్తారు? ఆ పాత్రలో అప్పుడు ఎవరు చేసినా కూడా అభిమానులు జీర్ణించుకోగలరా? లేదంటే అటు ఎన్టీఆర్ పాత్రను పోషిస్తూ ఇటు బాలయ్య రియల్ లైఫ్ పాత్రను కూడా బాలయ్యే పోషిస్తారా? కాని తన తండ్రిపై తీస్తున్న బయోపిక్ లో ఆయన అలా డబుల్ యాక్షన్ చేయడం.. అసలు మెసేజ్ ను కాస్త నీరుగార్చే ఛాన్సుంది.

దీనిబట్టి చూస్తే.. ఈ బయోపిక్ లో మోక్షజ్ఞ ఏ పాత్రా పోషించకపోతేనే బాగుంటుంది. లేదంటే ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రను పోషిస్తే.. పెద్దయ్యాక ఆ పాత్రను బాలయ్య పోషిస్తారు కాబట్టి.. అటు ఎమోషనల్ గా ఇటు లాజికల్ గా కరక్టుగా ఉంటుంది. ఏదేమైనా కూడా దర్శకుడు తేజ ఎప్పుడైతే బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్న అని ప్రకటించారో.. అప్పటినుండి మోక్షజ్ఞ చుట్టూ రూమర్లు ప్రదిక్షణాలు చేస్తూనే ఉన్నాయి. అది సంగతి.