మాస్ రాజా సినిమా ఆగలేదట!

Tue Dec 11 2018 19:34:48 GMT+0530 (IST)

'అమర్ అక్బర్ అంటోనీ' తర్వాత మాస్ మహారాజా రవితేజ యువ దర్శకుడు వీఐ ఆనంద్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  కానీ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో రవితేజ పునరాలోచనలో పడ్డాడని.. దాంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఈమధ్య వార్తలు వచ్చాయి.  కానీ తాజా సమాచారం ఏంటంటే ఆ వార్తలన్నీ రూమర్లేనట.రవితేజ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరసగా నిరాశ పరుస్తూ ఉండడంతో తన కొత్త సినిమా విషయంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకొదలుచుకోలేదట.  స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని దర్శకుడు వీఐ ఆనంద్ కు సూచించాడట.  దీంతో రవితేజ సూచించిన మార్పుచేర్పులను చేసే పనిలో వీఐ ఆనంద్ బిజీగా ఉన్నాడట.   స్క్రిప్ట్ రిపేర్లు పూర్తి కాగానే సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నాలలో ఉన్నారట.

సినిమా ఆగిపోయిందనే రూమర్లకు చెక్ పెడుతూ త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.  ఇదంతా బాగానే ఉంది గానీ ఈ సినిమాతోనైనా రవితేజ ఫ్లాపుల పరంపరకు తెరపడుతుందో లేదో వేచి చూడాలి.