Begin typing your search above and press return to search.

వాళ్లా? పవన్ కి తమ్ముళ్లా? ప్చ్

By:  Tupaki Desk   |   29 Sep 2016 1:30 PM GMT
వాళ్లా? పవన్ కి తమ్ముళ్లా? ప్చ్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్ మొదలైపోయిందని.. పవన్ కూడా కాటమరాయుడు యూనిట్ తో జతయిపోయాడని ఇప్పటికే చెప్పేసుకున్నాం. అయితే.. ఈ సినిమాలో పవన్ కి తమ్ముళ్లుగా నటించాలంటూ.. కొందరు కుర్ర హీరోలును అడిగితే.. వాళ్లు కాదన్నారంటూ.. కావాలనే తెగ హంగామా నడిపించేస్తున్నారు.

ఈ కాటమరాయుడు చిత్రాన్ని తమిళ్ మూవీ వీరమ్ కి పవన్ స్టైల్లో మార్చేసిన రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ వీరమ్ ఇప్పటికే తెలుగులో వీరుడొక్కడే పేరుతో డబ్బింగ్ అయ్యింది కూడా. అలాంటిది ఆ డబ్బింగ్ సినిమాని యాజ్ఇటీజ్ తీసేసి.. తెలుగులో మళ్లీ సినిమా రిలీజ్ చేయడానికి.. పవన్ ఏమన్నా తెలివి తక్కువ వాడా ? ఆ విషయం పిచ్చి రాతలు రాసేవాళ్లకు తెలీదా? అయినా.. ఆయా కుర్ర హీరోలను అప్రోచ్ అయ్యారని వీళ్లకు ఎవరు చెప్పారో అన్నది అర్ధం కాని విషయం. శర్వానంద్.. రాజ్ తరుణ్.. విజయ్ దేవరకొండలను.. తమ్ముళ్లుగా తీసుకుంటే గానీ పవన్ సినిమాకి వాల్యూ రాదా?

ఓ సినిమాలో పవన్ పక్కన ఓ ఫ్రేమ్ లో నుంచుంటే చాలని అనుకునే హీరోలు చాలామందే ఉన్నారు. అయితే సొంత ఫ్యామిలీ నుంచే.. వీళ్లకంటే క్రేజ్ ఉన్న కుర్రాళ్లను తెచ్చుకోగలడు పవన్. అయినా.. ఏంటో.. ఈ పిచ్చి రాతలు అనుకున్న నిర్మాత మరార్.. వాళ్లెవరినీ అప్రోచ్ అవలేదని.. పక్కా క్లారిటీ ఇచ్చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/