వారాహికి నో చెప్పావా శౌర్యా?

Thu Jul 12 2018 20:00:01 GMT+0530 (IST)

ఛలో ఇచ్చిన సక్సెస్ కిక్ తో ఫుల్ జోష్ మీదున్న నాగ శౌర్య ప్రస్తుతం నర్తనశాల ఫినిషింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఛలో తర్వాత వచ్చిన కణం-అమ్మమ్మగారిల్లు అంతగా ప్రభావం చూపకపోయినా ఇప్పటికిప్పుడు శౌర్య మార్కెట్ కు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. అతనితో బయటి నిర్మాతలు సినిమాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నా ప్రస్తుతానికి తమ ఐరా బ్యానర్ లోనే నర్తనశాల చేస్తున్న శౌర్య ఇటీవలే వారాహి సంస్థకు నో చెప్పాడనే గాసిప్ ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం అవుతోంది.  శౌర్యకు టాలీవుడ్ లో మేజర్ బ్రేక్ ఇచ్చిన ఊహలు గుసగుసలాడే తీసింది వారాహినే - దాని ద్వారానే దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ హీరోయిన్ గా రాశి ఖన్నా వెలుగులోకి వచ్చారు - ఆ బాండింగ్ తోనే  సాయి కొర్రపాటి నాగ శౌర్యను కలిసినట్టు పారితోషికం దగ్గర ఏదో పేచీ రావడం వల్ల వెనక్కు తగ్గినట్టు వార్తలు  వస్తున్నాయి. ఇవి నిజమో కాదో కానీ డిమాండ్ ఉన్నప్పుడు మార్కెట్ కు తగ్గట్టు అడగటంలో తప్పేమి అని అడిగేవారు కూడా లేకపోలేదు.వారాహి బ్యానర్ లో నాగ శౌర్య ఆదే అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో జో అచ్యుతానంద చేసాడు. అది కూడా సక్సెస్ కొట్టేసింది.  దిక్కులు చూడకు రామయ్య కూడా చేసాడు కానీ అదొక్కటి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. నాలుగోది  కూడా చేస్తే  బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రయత్నిస్తే వర్క్ అవుట్ కాలేదని టాక్. నాగ శౌర్య నర్తనశాల తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు కానీ దేనికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వినికిడి. ఇవాళ విడుదలైన విజేత ఫలితం ఇంకా తేలాల్సి ఉంది. మరోపక్క ఎన్టీఆర్ బయోపిక్ భాగస్వామ్యంలో కూడా సాయి కొర్రపాటి ఉన్నారు.ఇవి కాకుండా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ తన ద్వారా జరగాలని ప్రయత్నిస్తున్న ఈయన అందుకోసం చాలా కాలం క్రితమే రానే వచ్చాడు ఆ రామయ్య అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసుకున్నారు . మరి బయోపిక్ తర్వాత ఆ ప్రయత్నాలకు బాలకృష్ణ ఊ అంటాడేమో చూడాలి