Begin typing your search above and press return to search.

కైరా ఏంటీ క్రేజ్‌.. పుకార్లే పుకార్లు

By:  Tupaki Desk   |   11 Nov 2018 6:52 AM GMT
కైరా ఏంటీ క్రేజ్‌.. పుకార్లే పుకార్లు
X
బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ తెలుగులో ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఏమీ లేదు. అయినా కూడా కైరా అద్వానీకి మంచి గుర్తింపు దక్కింది. భరత్‌ అనే నేను చిత్రం విడుదలకు ముందే రామ్‌ చరణ్‌ - బోయపాటి శ్రీను చిత్రంలో హీరోయిన్‌ గా కన్ఫర్మ్‌ అయ్యింది. ఒక వైపు బాలీవుడ్‌ లో నటిస్తూనే మరో వైపు టాలీవుడ్‌ లో కూడా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ప్రస్తుతం చేస్తున్న చరణ్‌ మూవీ ‘వినయ విధేయ రామ’ చిత్రం విడుదలకు ముందే మరికొన్ని ఆఫర్లు కూడా ఈమె తలుపు తడుతున్నాయి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ముఖ్యంగా అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ ల కాంబినేషన్‌ లో రూపొందబోతున్న చిత్రంలో హీరోయిన్‌ గా కైరా అద్వానీ ఎంపిక అయ్యిందని కాస్త బలంగానే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన కథ ఫైనల్‌ కాలేదు. అప్పుడే హీరోయిన్‌ ను దర్శకుడు ఎలా ఫైనల్‌ చేస్తాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు మహేష్‌ బాబు - సుకుమార్‌ ల కాంబినేషన్‌ లో వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్న సినిమా కోసం కూడా కైరా అద్వానీని సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏ పెద్ద సినిమా మొదలు కాబోతున్నా కైరా పేరు పరిశీలనలో ఉందనో లేదంటే కైరాను తీసుకున్నారనో వార్తలు వస్తున్నాయి.

కైరా అద్వానీ ప్రస్తుతం చేస్తున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం కూడా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉన్న కారణంగా ఈమెతో వర్క్‌ చేసేందుకు స్టార్‌ హీరోలు ఆసక్తి చూపుతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చిరు 152వ చిత్రం కోసం కూడా కొరటాల శివ ఈమెను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమద్య కాలంలో ఒక హీరోయిన్‌ గురించి మరీ ఇంతగా పుకార్లు రావడం ఇదే కావచ్చు. పుకార్లలో షికార్లు చేస్తున్న ఎన్ని ప్రాజెక్ట్‌ లలో ఈమె ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే వినయ విధేయ రామ చిత్రం తప్ప అధికారికంగా ఏ ఒక్క సినిమా ఈమె చేయడం లేదని సమాచారం అందుతోంది. త్వరలోనే ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.