Begin typing your search above and press return to search.

చిరు-జక్కన్న సీక్రెట్ మీట్ కాదా?

By:  Tupaki Desk   |   29 May 2017 6:29 AM GMT
చిరు-జక్కన్న సీక్రెట్ మీట్ కాదా?
X
పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి.. తన నూట యాభయ్యవ చిత్రం ఖైదీ నంబర్ 150తో.. సెన్సేషన్స్ క్రియేట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాతి చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సబ్జెక్టును ఎంచుకున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ ఫుల్ పేస్ లో ఉండగా.. పీరియాడిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీ కోసం.. చాలా బడ్జెట్ తో కూడిన సెట్స్ ను వేయాల్సి ఉంటుంది.

ఉయ్యాలవాడ విషయంలో పట్టుదలగా ఉన్న చిరంజీవి.. ఇప్పటికే బడ్జెట్ అంచనాలను 140 కోట్లకు పైగా కేటాయించారనే టాక్ ఉంది. అందుకే ఈ మూవీకి సంబంధించి.. బాహుబలి2తో చారిత్రాత్మక విజయం సాధించిన రాజమౌళితో చర్చలు జరిపారని.. అది కూడా గంటలకొద్దీ మాట్లాడారనే న్యూస్ ఒకటి వైరల్ గా స్ప్రెడ్ అవుతోంది. సెట్స్ కు సంబంధించిన విషయాలపైనే ఎక్కువగా చర్చించారన్నది వాటి సారాంశం. అయితే.. దీన్ని మెగా టీం ఖండిస్తోంది.

బాహుబలి2 చిత్రాన్ని చూసిన చిరంజీవి.. రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడిన మాట వాస్తవమే. అయితే.. బాహుబలి2 రిలీజ్ తర్వాత కానీ.. ఉయ్యాలవాడ సబ్జెక్ట్ అనుకున్న తర్వాత కానీ.. ఈ మధ్య కాలంలో ఎక్కడా చిరంజీవి- రాజమౌళి భేటీ అయిన దాఖలాలు లేవని తేల్చేస్తున్నారు మెగా ఫ్యామిలీ సన్నిహితులు. ఇప్పటికే ధృవ వంటి సబ్జెక్ట్ తో సక్సెస్ సాధించిన దర్శకుడు సురేందర్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని.. ఈ విషయంలో మరో అంశానికి తావు లేదని తేల్చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/