Begin typing your search above and press return to search.

చిరు 150.. గేమ్స్ మామూలుగా లేవు

By:  Tupaki Desk   |   30 July 2016 1:30 PM GMT
చిరు 150.. గేమ్స్ మామూలుగా లేవు
X
చిరంజీవి 150వ సినిమాతో తొలిసారి నిర్మాత అవతారం ఎత్తుతున్న రామ్ చరణ్.. జనాలతో బాగానే ఆడుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించి విరుద్ధమైన ప్రకటనలు.. ప్రచారాలు చూస్తుంటే జనాలకు దిమ్మదిరిగిపోతోంది. ఈ సినిమా మొదలవ్వడానికి ముందు ధర్శకుడి విషయంలో.. కథ విషయంలో ఎన్నెన్ని రూమర్లు నడిచాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక సినిమా ఓకే అయ్యాక ప్రారంభోత్సవం విషయంలో పెద్ద డ్రామా నడిచింది. చివరికి ప్రారంభోత్సవం అయ్యాక రెగ్యులర్ షూటింగ్ గురించి సస్పెన్స్.. ఎట్టకేలకు ఈ మధ్యే సినిమా సెట్స్ మీదికి వెళ్లినా.. టైటిల్ ఏంటి.. హీరోయిన్ ఎవరు.. విలన్ పాత్ర ఎవరితో చేయిస్తారు అనే విషయంలో సస్పెన్స్.

ఆ మధ్య ఫేస్ బుక్ చాట్ సందర్భంగా ‘కత్తిలాంటోడు’ వర్కింగ్ టైటిల్ మాత్రమే అన్నాడు చరణ్. ఆ తర్వాతేమో నెపోలియన్ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. లేటెస్టుగా ‘కత్తిలాంటోడు’ అనే టైటిలే చరణ్ రిజిస్టర్ చేయించాడంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో డ్రామా మామూలుగా లేదు. రకరకాల పేర్లు తెరమీదికి రావడం.. పక్కకు వెళ్లడం.. ఇలా సాగుతోంది తంతు. ఈ మధ్య కాజల్ అగర్వాల్ హీరోయిన్ అన్నారు. తర్వాత ఆమె కాదంటూ యూనిట్ వర్గాలు స్పష్టం చేశాయి. కానీ ఇప్పుడు మళ్లీ ఆమె ఈ సినిమాకు సంతకం చేసిందంటూ ట్విట్టర్లో పెద్ద ప్రచారం జరుగుతోంది. కొంచెం క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులే కాజల్ చిరు సరసన నటించబోతుందని అంటున్నారు. మరోవైపు విలన్ పాత్రలో కొత్తగా బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా పేరు వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతో చూడాలి.