Begin typing your search above and press return to search.

అవునా!! టైటిల్ కూడా పెట్టేశారా??

By:  Tupaki Desk   |   28 July 2016 11:30 AM GMT
అవునా!! టైటిల్ కూడా పెట్టేశారా??
X
నిన్న సడన్ గా ఒక న్యూస్ బయటకొచ్చింది. ''నెపోలియన్'' అనే పేరును మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం సెలక్టు చేశారని టాక్‌ రావడంతో.. మెగా ఫ్యాన్సు కూడా విస్తుపోయారు. ఈ విషయం మనం కూడా చెప్పుకున్నాం. అంటే గతంలో స్టాలిన్‌.. ఠాగూర్.. వంటి పేర్లు పెట్టారు కాబట్టి ఇప్పుడు నెపోలియన్ అంటే కాస్త నమ్మశక్యంగానే ఉంది. ఇకపోతే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఆ లోగో డిజైన్ లో నిజానికి క్రియేటివిటీ నుండి క్వాలిటీ వరకు ఏదీ లేకపోయినా కూడా.. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ దానిని రిలీజ్ చేయడంతో.. నిజమేనేమో అని చాలామంది అనుకున్నారు. కట్ చేస్తే.. ఆ ఇమేజ్ ను సదరు కంపెనీ తీసేసింది. ప్చ్!!

ఇదే విషయాన్ని మరి అసలైన మెగా పి.ఆర్. టీమ్ ను అడిగితే క్లారిటీ వచ్చేస్తుందిగా. అందుకే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా టైటిల్ గురించి 'కొణిదెల ప్రొడక్షన్స్' ఆఫీసు వారి దగ్గర ప్రస్తావిస్తే.. ''అవునా.. టైటిల్ పెట్టారా? అలాగైతే మా నిర్మాత (చరణ్‌)కు కూడా ఇన్ఫామ్‌ చేయాలి మరి'' అంటూ కామెడీ చేశారు. అంటే దానర్ధం.. ఈ ''నెపోలియన్'' అనే టైటిల్ కేవలం రూమర్ అనేగా? నిజానికి ఒకవేళ చిరంజీవి 150 కోసం ఒక టైటిల్ అంటూ సెలక్టు చేస్తే.. ముందు ఆ విషయం రామ్‌ చరణ్‌ దగ్గర నుండి డైరక్టుగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే టైటిల్ ఓకె అవ్వగానే అభిమానులకు చెప్పేయాలని తానే అందరికంటే ఎక్కువగా ఉవ్విళ్ళూరుతున్నట్లు చరణ్‌ గత ఫేస్ బుక్ ఇంటర్యూలో కూడా చెప్పాడు.