Begin typing your search above and press return to search.

బన్నీకి ఆ బైక్ తో పనేంటి?

By:  Tupaki Desk   |   21 May 2019 5:46 AM GMT
బన్నీకి ఆ బైక్ తో పనేంటి?
X
ఇంకా త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ పట్టుమని పది శాతం కూడా పూర్తి కాలేదు అప్పుడే అల్లు అర్జున్ తర్వాత మూవీ గురించిన అప్ డేట్స్ చర్చలోకి వస్తున్నాయి. తన పుట్టిన రోజు సందర్భంగా మూడు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన బన్నీ ఈ రెండేళ్లలో అన్ని విడుదల అయ్యేలా ప్లానింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం చేస్తున్నది కాగానే సుకుమార్-వేణు శ్రీరామ్ లలో ఎవరి స్క్రిప్ట్ పక్కాగా రెడీగా ఉందో వాళ్ళతో ప్రొసీడ్ అవుతాడు.

వేణు శ్రీరామ్ ఐకాన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. గతంలో ఇది ఫిలిప్పినో మూవీ కిటకిటకు రీమేక్ అనే ప్రచారం గట్టిగానే జరిగింది. అయితే దాన్ని ఖండిస్తూ టీమ్ నుంచి క్లారిటీ వచ్చేసింది. అయితే దేని మీద ఐకాన్ కథ ఉంటుందనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఫ్రెష్ టాక్ ప్రకారం ఐకాన్ పోస్టర్ లో చూపించిన బైక్ కథలో కీలక భాగంగా ఉంటుందట. క్యాప్షన్ కనపడుట లేదు అని పెట్టారు కాబట్టి దేని గురించో అన్వేషణ సాగిస్తూ హీరో పాత్ర సాగేలా ఐకాన్ ఉంటుందట.

ఇలాంటి స్టోరీస్ లో సాధారణంగా హీరో వెతికేది అయితే హీరోయిన్ లేదా నిధి లాంటి విలువైన సంపద. ఇప్పటి ట్రెండ్ లో ట్రెజర్ హంట్ అవుట్ డేటెడ్ కాబట్టి వెరైటీ కోసం విలన్ ను వెతికే మిషన్ లో హీరో ఉంటాడేమో చూడాలి. మొత్తానికి డిఫరెంట్ సబ్జెక్టు అనే స్పష్టత దొరికింది. త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ పూర్తవ్వడానికి ఎంత లేదన్నా ఆరేడు నెలలు పడుతుంది కాబట్టి వేణు శ్రీరామ్ కన్నా ముందే సుకుమార్ ఫుల్ వెర్షన్ రెడీ చేసుకుంటే ఐకాన్ కొంత వెనక్కు వెళ్ళాక తప్పదు