ఇది కూడా కాపీ అంటున్నారు?

Sun Jan 14 2018 11:22:18 GMT+0530 (IST)

అజ్ఞాతవాసి తర్వాత తెలుగు సినిమాల్లో కాపీ పేరుతో స్ఫూర్తి పేరుతో ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చి తమ స్వంత టాలెంట్ గా దర్శకులు రచయితలు చెప్పుకోవడం గురించిన చర్చ చాలా తీవ్రంగా జరుగుతోంది. ఇదేమి కొత్త కాకపోయినా గతంలో కూడా ఎందరో దర్శకులు చేసిందే అయినా ఇప్పుడు సోషల్ మీడియా విపరీతమైన వాడుకలోకి వచ్చాక మీడియా చాలా అప్రమత్తంగా ఉన్న నేపధ్యంలో పరిస్థితులు గతంలో లాగా అనుకూలంగా అయితే లేవు. ఇకపై ఏదైనా కాపీ కొట్టాలంటే హక్కులు తీసుకోవడం గురించి సీరియస్ గా ఆలోచించక తప్పదు. పరిస్థితి ఎక్కడి దాకా వచ్చింది అంటే గతంలో వచ్చిన కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఎక్కడెక్కడి నుంచి అరువు తెచ్చుకుని తమ స్వంతమని చెప్పి వాడుకున్నారో వీడియో సాక్ష్యాలతో సహా బయట పెట్టేస్తున్నారు.తాజాగా సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ సినిమా మీద కూడా అలాంటి గాసిప్స్ మొదలైపోయాయి. పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమ లాంటి క్లాసిక్ లవ్ స్టొరీ రూపొందించిన కరుణాకరన్ దర్శకత్వంలో కెఎస్ రామారావు నిర్మాణంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వినాయక్ ఇంటెలిజెంట్ తరువాత విడుదలయ్యే మూవీ ఇదే. ఇది హాలీవుడ్ సినిమా ‘ది వో’ నుంచి స్ఫూర్తి చెంది కరుణాకరన్ కథ రాసుకున్నారు అని కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. యాక్సిడెంట్ వల్ల జ్ఞాపకశక్తి కోల్పోయిన హీరొయిన్ కోసం హీరో చేసే పోరాటమే ఈ సినిమా. 2012లో వచ్చిన ఈ మూవీలోని పాయింట్ నే తెలుగీకరించి మార్చి తీస్తున్నారనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

ఇది ప్రస్తుతానికి ఎటువంటి ఆధారాలు లేని ఒక గాలి వార్తగానే తీసుకోవాలి. నిజం ఏంటి అనేది విడుదల అయ్యాక కాని బయటికి రాదు. కరుణాకరన్ గత తెలుగు సినిమా ఎందుకంటే ప్రేమంటా కూడా ‘జస్ట్ లైక్ హెవెన్’ స్ఫూర్తితోనే రూపొందిందని అప్పట్లో కథనాలు వచ్చాయి. అది ఫ్లాప్ కావడంతో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. దసరాకు ప్లాన్ చేసిన ఈ మూవీ టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదు.