బికినీ బీచ్ లో కొత్త వయ్యారం

Tue Feb 19 2019 11:39:45 GMT+0530 (IST)

టీసిరీస్ పాప్ ఆల్బమ్స్ తో పాపులరైంది రుహి సింగ్. ఈ బ్యూటీ బాలీవుడ్ లో ప్రస్తుతం సీరియస్ గా ప్రయత్నాల్లో ఉందిట. బికినీ టు లిప్ లాక్ ఏమాత్రం అడ్డు చెప్పని ఈ టాప్ మోడల్ గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో దర్శకనిర్మాతలకు తనదైన శైలిలో ఫీలర్స్ వదులుతోంది. గ్లామర్ వలర్డ్  తన నుంచి కావాల్సినది అందిపుచ్చుకోవచ్చు అన్న క్లారిటీని ఇచ్చేస్తోంది.లేటెస్ట్ గా బికినీ బీచ్ లో పరికిణీ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చిన వైనం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. పాక్షికంగా బికినీ ని కవర్ చేస్తూ ధరించిన ఆ పరికిణీ అమ్మడి అందాన్ని మరింతగా ఎలివేట్ చేసిందనడంలో సందేహం లేదు. సూటిగా సూర్య కిరణాలు తనని తాకుతుంటే.. నును లేత కిరణాల ఎండలో తళతళా మెరిసిపోతోంది ఈ పరికిణీ బ్యూటీ. ముంబై టు చెన్నయ్.. చెన్నయ్ టు హైదరాబాద్ .. అలా అలా రుహి ఖ్యాతి సామాజిక మాధ్యమాల ఆసరాగా పాకిపోతోంది. ఇలా అయితే మన దర్శకనిర్మాతలు పిలిచి ఛాన్సిచ్చేస్తారేమో చూడాలి.

2012లో ది వరల్డ్ బిఫోర్ హెర్ అనే డాక్యు సినిమాలో నటించిన రుహి ఆ తర్వాత మధుర్ భండార్కర్ క్యాలెండర్ గాళ్స్ చిత్రంతో హిందీ తెరకు పరిచయమైంది. అటుపై ఇష్క్ ఫరెవర్ - బొంగు - స్పాట్ లైట్ 2 చిత్రాల్లో నటించింది. మునుముందు కెరీర్ పరంగా స్పీడ్ పెంచేందుకు చాలానే తంటాలు పడుతోంది.