ఫోటో స్టొరీ: చిలిపిగా చిలసౌ గర్ల్!

Wed Jan 16 2019 14:40:49 GMT+0530 (IST)

'చిలసౌ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుహాని శర్మ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదుగానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో ఫిలిం మేకర్లకు గ్లామర్ షోకు రెడీ అని ఇండికేషన్స్ ఇస్తోంది.తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా రుహాని ఒక ఫోటో పోస్ట్ చేసింది.  బ్రౌన్.. బ్లాక్ కాంబినేషన్ చక్స్ ఉన్న షర్టు వేసుకున్న రుహాని పైన రెండు బటన్లు వేసుకోకుండా నెటిజనులను టీజ్ చేసింది.  వాటితో పాటుగా మూడో బటన్ ను కూడా విప్పుతున్నట్టుగా చేతులు పెట్టిమరీ పోజిచ్చింది.  ఈ భామ హెయిర్ స్టైల్ కర్లీగా ఉండడంతో లుక్ స్టైలిష్ గా ఉంది. మెడలో బ్లాక్ కలర్ చెయిన్ వేసుకుంది గానీ వేరే యాక్సెసరీస్ అసలు లేవు. రుహాని ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది.  క్యాజువల్ షర్టుతో ఇంత హాట్ గా కనిపించడం అనేది కూడా ఒక కళే.   

ఈ ఫోటోకు దాదాపుగా ఇరవై వేల లైకులు వచ్చాయి. ఆమె ఫాలోయర్ల సంఖ్య ఇంకా మిలియన్లలోకి చేరుకోలేదు కాబట్టి లైకులు తక్కువే ఉన్నాయి లేకపోతే ఇప్పటికే లైకుల సంఖ్య లక్షల్లో ఉండేది.  ఈ లైకుల సంగతేమో గానీ ఫిలిం మేకర్లు కనుక ఈ ఫోటోలు చూస్తే ఆమెకు కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం మాత్రం ఉంది.