Begin typing your search above and press return to search.

3 సినిమాలు 16 సెల‌వు దినాలు

By:  Tupaki Desk   |   7 Oct 2015 5:49 AM GMT
3 సినిమాలు 16 సెల‌వు దినాలు
X
9, 16, 22.. ఈ అక్టోబర్‌ నెల‌లో ఇవి మూడు కీల‌క‌మైన తేదీలు. ఈ తేదీల్లో వ‌రుస‌గా భారీ క్రేజీ సినిమాలు రిలీజ‌వుతున్నాయి. ద‌స‌రా పేరు చెప్పుకుని ఈసారి 16రోజుల సెల‌వులు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయి. ఈ సెల‌వులు రిలీజ్‌ కి వ‌స్తున్న సినిమాల‌కు పెద్ద అస్సెట్‌. మ‌రి అందివ‌చ్చిన అవ‌కాశాన్ని బాక్సాఫీస్ వ‌ద్ద అందిపుచ్చుకుంటారా? లేదా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

ద‌స‌రా కానుక‌గా ఈనెల 9 నుంచి 25 వ‌ర‌కూ సెల‌వులు. కాలేజీలు, స్కూళ్లు, ఉద్యోగాలు ఇలా అన్నిటికీ సెల‌వు దినాలు ఎక్కువ‌గానే ఉన్నాయి ఈసారి. అందుకే ఈ సీజ‌న్‌లో రిలీజ‌వుతున్న సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల కంటైనర్ నింపుకుంటాయన‌డంలో సందేహ‌మే లేదు. అయితే వారం వారం ఒక్కో సినిమా రిలీజ‌వుతున్నాయి. కాబ‌ట్టి .. మొద‌టివారంలో సాధ్య‌మైనంత ఎక్కువ‌గా వ‌సూళ్లు లాగేస్తేనే ఆ సినిమాకి సేఫ్ అన్న విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి.

ఆ లెక్క‌న చూసుకుంటే గుణ‌శేఖ‌ర్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ బ‌డ్జెట్ చిత్రం రుద్ర‌మ‌దేవి 3డి మొద‌ట‌గా 9వ తేదీన రిలీజ‌వుతోంది. 9 నుంచే ప్ర‌భుత్వ సెల‌వులు మొద‌ల‌వుతున్నాయి కాబ‌ట్టి ఆ మేర‌కు రుద్ర‌మ‌దేవికి భారీగానే వ‌సూళ్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉంది. అద్భుతంగా ఉంది అని టాక్ వ‌స్తే చాలు.. ఆటోమెటిగ్గా పెద్ద హిట్ట‌వుతుంది. కాంపిటీష‌న్ ఉన్నా రెండు వారాల పాటు సెల‌వుల్ని బాగా క్యాష్ చేసుకునే ఛాన్సుంది.

అలాగే బ్రూస్‌లీ చిత్రానికి 10 రోజుల పాటు నిరాటంకంగా వ‌సూళ్ల వేట సాగించే ఛాన్సుంది. అయితే అక్కినేని అఖిల్ హీరోగా న‌టించిన అఖిల్ చిత్రానికి మాత్రం నాలుగే నాలుగు సెల‌వు దినాలు మిగిలి ఉన్నాయి. ఈ నాలుగు రోజుల్లోనే అఖిల్ స‌త్తా చాటాల్సిందే. విజ‌య‌ద‌శ‌మి రోజున అంటే 22న రిలీజ‌వుతోంది కాబ‌ట్టి 22 - 23 - 24 -25 తేదీల్లో భారీ వ‌సూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగాలు య‌థాత‌థంగా మొద‌ల‌వుతాయి. అదీ సంగ‌తి.