Begin typing your search above and press return to search.

రుద్రమ టాక్- సూపర్ హిట్ ఖాయం

By:  Tupaki Desk   |   8 Oct 2015 5:30 PM GMT
రుద్రమ టాక్- సూపర్ హిట్ ఖాయం
X
పక్కా కమర్షియల్ మూవీ రుద్రమదేవి.. అదేంటి రుద్రమదేవి చారిత్రక చిత్రం కదా.. కమర్షియల్ ఏంటి అనే అనుమానం రావచ్చు. అదే గుణశేఖర్ ట్యాలెంట్. రుద్రమదేవిగా అనుష్క నటించిన ఈ సినిమా సూపర్బ్ గా వచ్చిందట. ఇప్పటికే ఇండస్ట్రీలో కొంతమందికి స్పెషల్ ప్రివ్యూలుగా చూపించారు. ప్రివ్యూ చూసినవారంతా మెస్మరైజ్ అయిపోయారట. రుద్రమ కమర్షియల్ సక్సెస్ ఖాయమని చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీలో.

ఇదంతా గుణశేఖర్ మేకింగ్ ట్యాలెంట్ కారణంగానే అని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్ టెయిన్ మెంట్ - గ్లామర్ లతో నింపేసిన గుణ.. సెకండాఫ్ కి వచ్చేసరికి ఫైట్స్ - ఎమోషన్స్ - ఛేజింగ్స్ - వార్ సీక్వెన్స్ - ట్విస్టులతో నింపేశాడట. రుద్రమ స్టోరీని గుణ చెప్పిన విధానం చాలా ఎఫెక్టివ్ గా వచ్చిందని తెలుస్తోంది. అనుష్ - రాణా - అల్లు అర్జున్ ల కేరక్టర్లను తీర్చిదిద్దిన తీరుపై ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే గ్రాఫిక్స్ పరంగా కొంత నాణ్యత ఉన్నమాట వాస్తవమే.

కానీ బాహుబలితో దీన్ని కంపేర్ చేయడానికి ఛాన్స్ లేదు. అందులో సగం కంటే తక్కువతోనే రుద్రమ తెరకెక్కింది. ఈ లోటును హార్ట్ టచింగ్ ఎమోషన్స్ - మెస్మరైజింగ్ విజువల్స్ తో కవర్ చేసేశాడట గుణశేఖర్. రుద్రమకు సూపర్ హిట్ ఖచ్చితంగా దక్కనుందనే టాక్ వినిపిస్తోంది. పైగా అసలే మనోడు సొంతంగా 80 కోట్లు డబ్బులు కూడా పెట్టేశాడు. సో.. ఈ టాక్‌ లాగానే హిట్టు కొట్టి పండగ చేసుకోవాలని ఆశిద్దాం.