Begin typing your search above and press return to search.

అదీ రుద్ర‌మ‌దేవి లెక్క‌

By:  Tupaki Desk   |   8 Oct 2015 1:36 PM GMT
అదీ రుద్ర‌మ‌దేవి లెక్క‌
X
రుద్ర‌మ‌దేవి మీద రూ.70 కోట్లు పోసేశాడు గుణ‌శేఖ‌ర్. బ‌డా హీరోల‌తో చేసినా ఇంత బ‌డ్జెట్ అంటే చాలా పెద్ద రిస్క్‌. అలాంటిది ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ మీద ఈ స్థాయిలో పెట్టుబ‌డి పెట్ట‌డ‌మంటే గుణ‌శేఖ‌ర్ చేస్తున్న‌ది అలాంటిలాంటి రిస్క్ కాదు. ఐతే గుణ‌శేఖ‌ర్ మాత్రం త‌నది సేల‌బుల్ ఐడియానే అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. మ‌రి త‌న 70 కోట్ల బ‌డ్జెట్‌ ను రిక‌వ‌ర్ చేసుకోవ‌డానికి గుణ‌శేఖ‌ర్ ఏం చేశాడు? బిజినెస్ ఎలా జ‌రిగింది? ఈ ఆస‌క్తిక‌ర విశేషాలు చూద్దాం ప‌దండి.

సినిమా ఎంత ఆల‌స్య‌మైన‌ప్ప‌టికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి రుద్ర‌మ‌దేవి బిజినెస్ బాగానే జ‌రిగింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రుద్ర‌మ‌దేవి థియేట్రిక‌ల్ బిజినెస్ రూ.42.4 కోట్లు జ‌ర‌గ‌డం విశేషం. నైజాం ఏరియాకు దిల్ రాజు రూ.12 కోట్ల‌కు రైట్స్ తీసుకున్నాడు. సీడెడ్‌ కు రూ.6 కోట్లు వ‌చ్చాయి. ఆంధ్రా ప్రాంతంలోనూ రూ.16 కోట్ల‌కు బిజినెస్ జ‌రిగింది. క‌ర్ణాట‌క‌కు రూ.3.75 కోట్లు - ఓవ‌ర్సీస్ కు రూ.4 కోట్లు - రెస్టాఫ్ ఇండియా రూ.60 ల‌క్ష‌ల మేర‌కు బిజినెస్ జ‌రిగింది. మొత్తం తెలుగు వెర్ష‌న్ రూ.42.4 కోట్లు తెచ్చిపెట్టింది.

రుద్ర‌మ‌దేవి త‌మిళ వెర్ష‌న్ థియేట్రిక‌ల్ - శాటిలైట్ రైట్స్ క‌లుపుకుని రూ.10 కోట్ల దాకా ప‌ల‌క‌గా.. మ‌ల‌యాళ వెర్ష‌న్ రూ.1.4 కోట్లు తెచ్చిపెట్టింది. హిందీ వెర్ష‌న్ రూ.5 కోట్లు ప‌లికింది. రుద్ర‌మ‌దేవి ఆడియో హ‌క్కులు రూ.50 ల‌క్ష‌ల‌కు అమ్ముడ‌య్యాయి. మొత్తంగా అన్ని లెక్క‌లూ క‌లిపితే రూ.59 కోట్ల దాకా తేలుతోంది. అయిన‌ప్ప‌టికీ ఇంకా లోటు చాలానే ఉంది. బ‌డ్జెట్ రూ.70 కోట్లే అయినా.. సినిమా లేటు కావ‌డం వ‌ల్ల ఇంకో ప‌ది కోట్ల దాకా వ‌డ్డీలు యాడ్ అయ్యాయి. అంటే గుణ బ‌య‌ట‌ప‌డాలంటే ఇంకో రూ.20 కోట్లు రావాలి. అది తెలుగు - హిందీ శాటిలైట్ రైట్స్ తో బ్యాలెన్స్ అవుతుంద‌ని ఆశిస్తున్నాడు గుణ‌. ఐతే అది సినిమాకు ఎలాంటి టాక్ వ‌స్తుంద‌న్న‌దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది.