Begin typing your search above and press return to search.

రుద్రమదేవి పంచ్ మామూలుగా లేదు

By:  Tupaki Desk   |   2 Oct 2015 5:14 AM GMT


ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా అన్నదే ముఖ్యం అంటాడు ‘పోకిరి’. డైరెక్టర్ గుణశేఖర్ కూడా ఇదే డైలాగ్ వల్లిస్తున్నాడు ‘రుద్రమదేవి’ హిందీ ట్రైలర్ ద్వారా. ఇన్నాళ్లూ ‘రుద్రమదేవి’ అంటే ఏంటో అనుకున్నారు కానీ.. తాజాగా అతను వదిలిన ట్రైలర్ చూస్తుంటే మాత్రం గుణ ఏదో మ్యాజిక్ చేసేలాగే ఉన్నాడనిపిస్తోంది.

ఇంతకుముందు వచ్చిన తెలుగు ట్రైలర్ తో పోలిస్తే ఈ కొత్త హిందీ ట్రైలర్ చాలా ఎఫెక్టివ్ గా అనిపిస్తోంది. యుద్ధంలో శత్రువుల్ని దెబ్బ తీయడానికి బలమైన ఆయుధాలు దాచుకున్నట్లు.. సినిమా రిలీజ్ కు ముందు ప్రేక్షకులకు షాకివ్వడానికి తన సినిమాలోని బెస్ట్ షాట్స్ అన్నీ దాచుకున్నట్లున్నాడు గుణశేఖర్. ఓ బ్యాంగ్ బ్యాంగ్ హిందీ ట్రైలర్ తో గట్టి పంచ్ విసిరాడు.

బాహుబలి సినిమాతో ఇప్పటికే రానా - అనుష్క హిందీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన నేపథ్యంలో ఈ కొత్త ట్రైలర్ వాళ్లను బాగానే ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. ఫస్ట్ ట్రైలర్ లో కంప్యూటర్ గ్రాఫిక్స్ - విజువల్ ఎఫెక్టులు కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించాయి కానీ.. ఇందులో బాగానే ఉన్నాయి.

విజువల్ గ్రాండియర్ అంతా స్క్రీన్ మీద కనిపించేలా ఆకర్షణీయంగా ట్రైలర్ తీర్చిదిద్దాడు గుణ. వార్ సీన్స్ కు సంబంధించిన దృశ్యాలైతే అద్భుతహ అనిపించేశాయి. రానా - అల్లు అర్జున్ - అనుష్క లుక్స్ బావున్నాయి. హిందీ వెర్షన్ నుంచి రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ - అభిషేక్ పిక్చర్స్ బయటకు వచ్చేసినట్లు జరుగుతున్న ప్రచారానికి కూడా తెరపడిపోయింది. ఈ సినిమాను వాళ్లే ఉమ్మడిగా రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ చూశాక ‘రుద్రమదేవి’పై బాలీవుడ్ లో ఆసక్తి పెరగడం ఖాయం.